📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

IBOMMA: రవి కేసులో షాకింగ్ విషయాలు.. కిక్కు కోసమే హ్యాకింగ్!

Author Icon By Tejaswini Y
Updated: November 17, 2025 • 11:47 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఐబొమ్మ(IBOMMA) రవి కేసులో దర్యాప్తు ముందుకు సాగుతున్న కొద్దీ ఆశ్చర్యకరమైన వివరాలు బయటపడుతున్నాయి. రవికి దాదాపు రూ.300 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇంత భారీ మొత్తాన్ని అతడు వివిధ డిజిటల్ వాలెట్లు, ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్‌లలో దాచిపెట్టినట్లు సమాచారం.

Read also : Banjara: బంజారా డిమాండ్ల సాధన కోసం 19, 20వ తేదీల్లో చలో ఢిల్లీ

‘కిక్’ కోసం హ్యాకింగ్ ప్రారంభించాడని

Shocking facts in Ravi’s case.. Hacking just for kicks!

డబ్బు సంపాదన కోసం కాదు, మొదట ‘కిక్’ కోసం హ్యాకింగ్ ప్రారంభించాడని విచారణ అధికారులు తెలిపారు. ముఖ్యంగా, సినిమా థియేటర్లలో విడుదలకు ముందు కొత్త సినిమాలు చూడాలనే ఆసక్తితోనే రవి హ్యాకింగ్‌ ప్రపంచంలోకి అడుగుపెట్టినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత అతని నైపుణ్యం పెరిగి, ప్రభుత్వ వెబ్‌సైట్లను కూడా హ్యాక్ చేసే స్థాయికి చేరుకున్నాడు. సైబర్‌ సెక్యూరిటీ అనలిస్ట్‌, ఎథికల్‌ హ్యాకర్‌గా మంచి పట్టు సాధించాడు.

కరీబియన్ దీవుల నుంచి ఐబొమ్మ

అతను కొంతకాలంగా కరీబియన్ దీవుల నుంచి ఐబొమ్మ వెబ్‌సైట్‌ను నిర్వహిస్తున్నాడని పోలీసులు గుర్తించారు. తాజాగా ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ కు చేరుకున్న సమాచారం రావడంతో, పోలీసులు ముందుగానే ప్లాన్ వేసి కూకట్‌పల్లిలో రవిని అరెస్ట్ చేశారు.

‘దేవుడు’ లాంటి వాడని కొందరు నెటిజన్లు

అయితే, రవికి సోషల్ మీడియాలో గణనీయమైన మద్దతు లభిస్తోంది. సినిమా టికెట్ల ధరలు పెరగడంతో పేద, మధ్యతరగతి ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లలేకపోతున్నారని, అలాంటి వారికి రవి ‘దేవుడు’ లాంటి వాడని కొందరు నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. టికెట్ ధరలు సామాన్యులకు అందుబాటులో ఉండేలా ఫిల్మ్ ఇండస్ట్రీ చర్యలు తీసుకోవాలని పలువురు సూచిస్తున్నారు.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read also :

Cyber Crime cyber security Digital Wallets Ethical Hacker Hacker Ravi Hyderabad News Ibomma Case Ibomma Ravi movie piracy Telangana crime

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.