📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం 22 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల LIC హౌసింగ్ ఫైనాన్స్ హోం లోన్లపై శుభవార్త ముంబై–దుబాయ్ అండర్‌వాటర్ బుల్లెట్ ట్రైన్! దేశంలోనే పొడవైన డబుల్ డెక్కర్ కారిడార్ ఐఐటీ ఢిల్లీ అద్భుత ఆవిష్కరణ.. మాజీ చీఫ్ లకు నోటీసులు చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం 22 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల LIC హౌసింగ్ ఫైనాన్స్ హోం లోన్లపై శుభవార్త ముంబై–దుబాయ్ అండర్‌వాటర్ బుల్లెట్ ట్రైన్! దేశంలోనే పొడవైన డబుల్ డెక్కర్ కారిడార్ ఐఐటీ ఢిల్లీ అద్భుత ఆవిష్కరణ.. మాజీ చీఫ్ లకు నోటీసులు

Latest News: iBomma-case: iBomma విచారణలో కొత్త మలుపు

Author Icon By Radha
Updated: November 21, 2025 • 9:19 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

iBOMMA వ్యవస్థాపకుడిగా భావిస్తున్న రవిపై రెండో రోజు విచారణలో పోలీసులు కీలక ఆధారాలను సేకరించారు. ఇప్పటివరకు పొందిన సమాచారాన్ని బట్టి, రవి ఒక పెద్ద నెట్‌వర్క్‌ను నిశ్శబ్దంగా నడిపిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. తమిళం, హిందీ సహా అనేక భాషల వెబ్‌సైట్ల నుంచి కొత్త సినిమాలను రవి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా, లావాదేవీల విషయంలో రవి పూర్తిగా క్రిప్టోకరెన్సీనే(Cryptocurrency) ఉపయోగించినట్లు దర్యాప్తులో స్పష్టమైంది. దీని వల్ల డబ్బు ట్రాక్ చేయడం కష్టమవుతుందని భావించి, ఇదే మోడ్ ఆపరేషన్‌ని ఎంచుకున్నాడని సైబర్ టీమ్ అభిప్రాయపడుతోంది.

Read also:12 A Railway Colony review : 12 ఏ రైల్వే కాలనీ మూవీ రివ్యూ థ్రిల్లర్ అంటూ వచ్చిన అల్లరి నరేష్…

ఇంకా కీలక విషయం ఏమిటంటే… iBOMMA ప్లాట్‌ఫారమ్‌ను కేవలం సినిమా పైరసీ కోసం మాత్రమే కాకుండా, బెట్టింగ్ యాప్స్‌కు గేట్‌వేగా కూడా ఉపయోగించినట్లు అధికారులు కనుగొన్నారు. ఈ బెట్టింగ్ మూలంగా వచ్చిన డబ్బుతోనే సినిమాలు కొనుగోలు చేయడం, కొత్త కంటెంట్ అందించడం జరిగిందని దర్యాప్తులో స్పష్టమైంది.

కరీబియన్ నుంచి నడిచిన పెద్ద నెట్‌వర్క్

దర్యాప్తు ప్రకారం, రవి భారతదేశంలో కాకుండా కరీబియన్ దీవుల్లో ఆఫీసు ఏర్పాటు చేసి కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు తేలింది. అక్కడ సుమారు 20 మంది ఉద్యోగులను నియమించి, సినిమాలు అప్‌లోడ్ చేయడం, నిర్వహణ, సర్వర్ షిఫ్ట్‌లు, కంటెంట్ మేనేజ్‌మెంట్‌ వంటి పనులు చేస్తున్నట్లు సమాచారం. సర్వర్లను విదేశాల్లో ఉంచడం వల్ల ట్రేస్ చేయడం కష్టమైందని అధికారులు చెబుతున్నారు. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో మిరర్ సైట్లను ఏర్పరచడం ద్వారా లీగల్ యాక్షన్ నుంచి తప్పించుకునే ప్రయత్నం జరిగినట్లు అనుమానిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ కేసు మరింత విస్తరించే అవకాశముందని, పలు అంతర్జాతీయ లింకులు బయటపడవచ్చని దర్యాప్తు సంస్థలు సూచిస్తున్నాయి.

iBOMMA కేసులో తాజా సమాచారం ఏమిటి?
రవి క్రిప్టో ద్వారా సినిమాలు కొనుగోలు చేసి, బెట్టింగ్ యాప్స్ ద్వారా వచ్చిన డబ్బుతో సైట్ నడిపినట్లు పోలీసులకు ఆధారాలు దొరికాయి.

ఆఫీసు ఎక్కడ నడుస్తోంది?
కరీబియన్ దీవుల్లో 20 మంది సిబ్బందితో పనిచేసే ఆఫీస్ ఉన్నట్లు తెలుస్తోంది.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read also :

crime-investigation crypto-payments ibomma-case latest news piracy-network

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.