IAS Couple Wedding: నేటి కాలంలో వివాహ వేడుకలు అంటే కోట్ల రూపాయల ఖర్చు, భారీ ఆడంబరాలతో కూడుకున్నవిగా మారిపోయాయి. కానీ, ఇద్దరు యువ ఐఏఎస్ అధికారులు మాత్రం ఆ తతంగానికి దూరంగా ఉంటూ, అత్యంత సాదాసీదాగా వివాహం చేసుకుని సమాజానికి గొప్ప ఆదర్శాన్ని చూపారు.
Read Also: BC Victory Telangana : బీసీల సంచలన విజయం, మున్సిపల్ ఫలితాల్లో కొత్త సందేశం
మినీ సచివాలయంలో రిజిస్టర్ వివాహం
2023 బ్యాచ్‌కు చెందిన మాధవ్ భరద్వాజ్, అదితి వాష్ణ్యేలు రాజస్థాన్‌లోని అల్వార్ మినీ సచివాలయంలో కలెక్టర్ అర్పితా శుక్లా సమక్షంలో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. ఎటువంటి హంగు ఆర్భాటాలు, బంధుమిత్రుల సందడి లేకుండా కేవలం దండలు మార్చుకుని వీరి వివాహ బంధం మొదలైంది. ప్రస్తుతం వీరిద్దరూ ఎస్డీఎం (SDM) లుగా సేవలందిస్తున్నారు. వీరి సింపుల్ పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో నెటిజన్లు వారిని అభినందిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: