కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ (DK Shivakumar) ఆర్సీబీ (RCB) ఫ్రాంచైజీలో వాటాలు దక్కించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు మీడియాలో వచ్చిన వార్తలను ఖండించారు. ఇటువంటి వార్తల్లో ఎటువంటి నిజం లేదని, తనకు ఆర్సీబీ యాజమాన్యంలో భాగస్వామ్యం కావాలనే ఆసక్తి లేదని స్పష్టంగా తెలిపారు. తనకు రాజకీయ బాధ్యతలే చాలా ఉన్నాయని, స్పోర్ట్స్ యాజమాన్యంలో చురుకుగా పాల్గొనాలనే ఆలోచన తనకు లేదన్నారు.
“నేను రాయల్ ఛాలెంజ్ కూడా తాగను!” – డీకే
ప్రత్యక్షంగా మీడియాతో మాట్లాడిన డీకే శివకుమార్, “నేను పిచ్చోడిని కాదు. నేను చాలా కాలంగా కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ సభ్యుడిగా ఉన్నాను. ఒకప్పుడు యాజమాన్యంలో భాగం కావాలని కొన్ని ఆఫర్లు వచ్చినా, నాకంత సమయం లేదు. నాకెందుకు ఆర్సీబీ కావాలి? నేను కనీసం రాయల్ ఛాలెంజ్ కూడా తాగను” అంటూ చమత్కారంగా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
వాటాలపై ప్రచారాలు అవాస్తవం
డీకే శివకుమార్ ఇచ్చిన ఈ ప్రకటనతో ఆర్సీబీలో వాటాలపై వస్తున్న ప్రచారాలకు తెరపడినట్టయింది. క్రికెట్‌కు తాను మద్దతు ఇస్తానని, అయితే యాజమాన్యంలో చేరాలన్న దురాశ తనకు లేదని ఆయన స్పష్టంగా చెప్పారు. రాజకీయ బాధ్యతలే పూర్తి స్థాయిలో నిర్వర్తించేందుకు తాను కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో తాను వ్యక్తిగతంగా ఏ సంబంధం లేనని కూడా పేర్కొన్నారు.
Read Also ; Laxman Singh: రాహుల్ గాంధీపై దిగ్విజయ్ సింగ్ సోదరుడు తీవ్ర వ్యాఖ్యలు.. పార్టీ నుంచి సస్పెండ్