📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Hydrogen train: దేశంలోనే తొలిసారిగా పట్టాలెక్కనున్న హైడ్రోజన్ రైలు

Author Icon By Sharanya
Updated: April 21, 2025 • 12:39 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారతదేశ రైల్వే వ్యవస్థ చారిత్రాత్మక మలుపు తిరగబోతోంది. ఇప్పటివరకు డీజిల్‌ మరియు విద్యుత్‌ ఆధారిత ఇంజిన్లతో నడుస్తున్న రైళ్లతోనే ప్రయాణాలు సాగుతూ వచ్చాము. కానీ, ఇప్పుడు దేశంలోనే తొలిసారి హైడ్రోజన్ ఆధారిత రైలు పట్టాలెక్కనుంది. ఇది కేవలం ఒక రైలు ప్రయాణమే కాకుండా, భవిష్యత్ పర్యావరణ హిత రవాణా వైపు దేశం వేసే బలమైన అడుగు కూడా.

రూ 80 కోట్ల ఖర్చు భారతీయ రైల్వేశాఖ సరికొత్త రైళ్లను ప్రవేశపెడుతోంది. హైడ్రోజన్‌తో నడిచే తొలి రైలు అందుబాటులోకి రాబోతోంది. రీసెర్చ్‌, డిజైన్‌, స్టాండర్డ్‌ సంస్థ తొలి హైడ్రోజన్‌ శక్తితో నడిచే రైలు డిజైన్‌ను రూపొందించింది. ఈ రైలు గరిష్ఠంగా గంటకు 110 నుంచి 140 కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది. హైడ్రోజన్‌ ఫర్‌ హెరిటేజ్‌ ఇన్నోవేషన్‌ కింద హైడ్రోజన్‌ పవర్‌తో నడిచే 35 రైళ్లను నడపాలని రైల్వే భావిస్తోంది.

ఎక్కడ ప్రారంభం అవుతోంది?

దేశంలోని హరియాణాలోని జీంద్ – సోనిపత్ మధ్య ఈ తొలి హైడ్రోజన్ రైలు ప్రయాణం ప్రారంభించనుంది. జూలై 2025 నుంచి ఈ రైలు నడవనుండగా, జీంద్ జిల్లాలోని వాషింగ్ లైన్‌, జంక్షన్ ప్రాంతాలలో విస్తరణ పనులు ఇప్పటికే శరవేగంగా జరుగుతున్నాయి. జీంద్‌ ప్రాంతంలో ఇది కొత్త పర్యావరణ అనుకూల రవాణా శకానికి నాంది పలికే ప్రాజెక్టుగా నిలవనుంది. పెట్టుబడి మరియు నిర్మాణం ఈ హైడ్రోజన్ రైలు నిర్మాణానికి రైల్వేశాఖ దాదాపు ₹80 కోట్లు ఖర్చు చేసింది. అలాగే గ్రౌండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధికి అదనంగా ₹70 కోట్లు ఖర్చవుతుందని అంచనా. దీనివల్ల ప్రతి హైడ్రోజన్ రైలు తయారీకి ₹150 కోట్ల పైగా ఖర్చవుతుంది.

భారతీయ పౌర ఇంజినీరింగ్ చాతుర్యం ఈ రైలును చెన్నైలో భారత రైల్వే రీసెర్చ్ డిజైన్ & స్టాండర్డ్ ఆర్గనైజేషన్ (RDSO) మరియు ఇతర సంస్థల సహకారంతో రూపకల్పన చేశారు. ప్రస్తుతం నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. హైడ్రోజన్ ప్లాంట్ నిర్మాణం కూడా చెన్నైలో వేగంగా సాగుతోంది. ప్లాంట్ పూర్తయిన తర్వాత రైలును జీంద్‌కు తరలించి, ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. ట్రయల్స్ విజయవంతంగా పూర్తయ్యాకే కమర్షియల్ సేవలు ప్రారంభం అవుతాయి. విస్తరణ ప్రణాళికలు జీంద్‌లోని వాషింగ్ లైన్‌ను ప్రస్తుతం 17 కోచ్‌ల సామర్థ్యంతో ఉండగా, దాన్ని 23 కోచ్‌లకు విస్తరించాలని రైల్వే అధికారులు నిర్ణయించారు. దీనిపై ఆయన అధికారులు కసరత్తు కొనసాగిస్తు న్నారు. ఆరు కోచ్​ల విస్తరణకు పనులు ప్రారస్తున్నారు చెప్పారు. కొత్త రైల్వే జంక్షన్ పునరుద్ధరణ పనులు ఆగస్టు-సెప్టెంబర్ నాటికి కానున్నాయి. హెరిటేజ్‌, హిల్‌స్టేషన్స్‌ రూట్స్‌లో ఈ రైళ్లను నడపేందుకు ప్రణాళికలు రచిస్తోంది. 40 వేల లీటర్ల నీటిని ఈ హైడ్రోజన్ రైలు ఉపయోగించు కోనుంది. ఒకసారి ట్యాంక్‌ నింపితే వెయ్యి కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుందని అధికారులు వెల్ లడించారు. కాగా, తొలిసారి హైడ్రోజన్‌తో నడిచే రైలు అందుబాటులోకి రానుండటంతో అందరి లోనూ ఆసక్తి కనిపిస్తోంది. ఈ రైలు ప్రయోగం విజయవంతమైతే, త్వరలోనే దేశవ్యాప్తంగా వివిధ మార్గాల్లో హైడ్రోజన్ రైళ్లు తిరగబోతున్నాయి.

Read also: China: చైనా ఉత్పత్తులకు భారత మార్కెట్ ‘డంపింగ్ గ్రౌండ్’గా మారనున్నదా?

#BharatFirstHydrogenTrain #GreenRailway #HydrogenPoweredTrain #HydrogenTrainIndia #IndianInnovation #IndianRailways Breaking News Today In Telugu Google News in Telugu India News Today in Telugu Latest News in Telugu Latest News today in Telugu News in Telugu Today Telugu News Today Today News In Telugu Today Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.