📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Latest Telugu news : Hydrogen – ఇంధన భద్రత పర్యావరణ బాధ్యతకు కీలకం : కేంద్రమంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరీ

Author Icon By Sudha
Updated: September 25, 2025 • 4:19 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హెడ్రోజన్‌ (Hydrogen)భవిష్యత్‌ ఇంధనమని కేంద్ర పెట్రోలియంశాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఈ ఇంధనం ప్రాముఖ్యతను మరోసారి నొక్కి చెప్పారు. ఇంధన భద్రత, ఆర్థిక పోటీతత్వం, పర్యావరణ బాధ్యతకు కీలకమైన స్తంభంగా పేర్కొన్నారు. 2030 నాటికి భారత్‌ ఏటా 5 మిలియన్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్‌ను (Hydrogen)ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుందని కేంద్రమంత్రి చెప్పారు. దీనికి బలమైన పాలసీతో పాటు రూ.19,700 కోట్ల విలువైన ఉత్పత్తి-సంబంధిత ప్రోత్సాహక (PLI) పథకం మద్దతు ఇస్తుందని తెలిపారు. బయోఫ్యూయల్ బ్లెండింగ్‌ను స్వీకరించడం ద్వారా సాధించిన విసయాలపై ఆయన స్పందించారు. 2020 నాటికి 10శాతం బయోఫ్యూయల్ (Biofuel)బ్లెండింగ్ లక్ష్యాన్ని నిర్ధేశించుకున్నామని.. తాము ఐదునెలల ముందుగానే లక్ష్యాన్ని సాధించామన్నారు. అప్పుడు 20శాతం బయోఫ్యూయల్‌ బ్లెండింగ్‌ని లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాయన్న ఆయన.. తొలి లక్ష్యాన్ని ఐదునెలల ముందుగానే సాధిస్తే.. రెండో లక్ష్యాన్ని ఆరేళ్ల ముందుగానే సాధించామన్నారు.

Hydrogen – ఇంధన భద్రత పర్యావరణ బాధ్యతకు కీలకం : కేంద్రమంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరీ

పానిపట్‌లోని ఇండియన్ ఆయిల్ గ్రీన్ హైడ్రోజన్ (Hydrogen)ప్లాంట్, విశాఖపట్నంలో టోక్యో ఎనర్జీ బిడ్‌లను ఉటంకిస్తూ.. భారత్‌లో హైడ్రోజన్ ఉత్పత్తి ఖర్చులు ఎలా క్రమంగా తగ్గుతున్నాయో మంత్రి వివరించారు. ఇది పెరుగుతున్న పెట్టుబడిదారుల విశ్వాసమని.. సాంకేతిక పరిపక్వతకు సంకేతంగా పేర్కొన్నారు. ఇండియన్ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్.. గ్రీన్ అమ్మోనియా టెండర్లను సైతం హెలెట్‌ చేశారు. సహజ వాయువు కంటే లాజిస్టికల్ ప్రయోజనాలను బట్టి గ్రీన్ అమ్మోనియాను ముఖ్యమైన ఎగుమతి అవకాశంగా మంత్రి అభివర్ణించారు. కేంద్ర మంత్రివర్గం జనవరి 4, 2023న రూ.19,744 కోట్ల వ్యయంతో నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్‌ను ఆమోదించింది. 2030 నాటికి ఏటా ఐదు ఎంఎంటీ గ్రీన్ హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేయడంతో పాటు గ్రీన్ హైడ్రోజన్‌ ఎగుమతిలో భారత్‌ను ప్రపంచం కేంద్రంగా మార్చాలన్నది ఈ మిషన్‌ లక్ష్యం.

హైడ్రోజన్ అంటే ఏమిటి?

హైడ్రోజన్ (దీనిని తెలుగులో ఉదజని అంటారు) అనేది రంగు, వాసన లేని, అత్యంత తేలికైన, అధికంగా మండే వాయువు, ఇది పరమాణు సంఖ్య 1 కలిగిన ఒక రసాయన మూలకం. ఇది విశ్వంలో అత్యంత సమృద్ధిగా లభిస్తున్న మూలకం, భూమిపై నీరు, మొక్కలు, జంతువులు, మానవులలో ఇతర మూలకాలతో కలిసి సమ్మేళన రూపంలో ఉంటుంది. హైడ్రోజన్ ఒక శక్తి వాహకంగా పనిచేస్తుంది మరియు ఇంధనంగా, అమ్మోనియా, మిథనాల్ వంటి రసాయనాల ఉత్పత్తిలో ఉపయోగించబడుతుంది. 

హైడ్రోజన్ ఎందుకు ఉపయోగిస్తారు?

హైడ్రోజన్‌ను పారిశ్రామిక ప్రక్రియలలో, రాకెట్ ఇంధనంగా మరియు విద్యుత్ ఉత్పత్తి మరియు వాహనాలకు శక్తినిచ్చే ఇంధన కణాలలో ఉపయోగిస్తారు. అనేక సహజ వాయువు ఆధారిత విద్యుత్ ప్లాంట్ల నిర్వాహకులు సహజ వాయువుకు అనుబంధంగా లేదా ప్రత్యామ్నాయంగా హైడ్రోజన్‌ను అన్వేషిస్తున్నారు.

Breaking News Clean Energy Energy Security green hydrogen Hardeep Singh Puri Hydrogen Energy latest news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.