📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం

Man Cuts Wife Braid : బ్యూటీపార్లర్​కు వెళ్లిన భార్య జడను కట్ చేసిన భర్త

Author Icon By Sudheer
Updated: April 20, 2025 • 8:24 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్‌ జిల్లాలో దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. అదనపు కట్నం కోసం భార్యను వేధించిన భర్త, చివరికి ఆమె జడను కత్తిరించే స్థాయికి చేరుకున్నాడు. పోలీసుల సమాచారం ప్రకారం, బాధిత మహిళ బ్యూటీ పార్లర్‌కు వెళ్లిన సమయంలో ఆమె భర్త రాంప్రతాప్ ముగ్గురు సహచరులతో అక్కడికి వచ్చి ఆమె జడను కత్తిరించాడు. ఈ ఘటనపై బాధితురాలి తండ్రి రాధాకృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు రాంప్రతాప్‌ను అరెస్ట్ చేశారు.

ఏడాది క్రితం తన కుమార్తె వివాహం

రాధాకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం, ఏడాది క్రితం తన కుమార్తె వివాహం జరిగింది. కానీ అప్పటి నుంచే రాంప్రతాప్ మరియు అతని కుటుంబ సభ్యులు అదనపు కట్నం కోసం వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఫ్రిడ్జ్‌, కూలర్‌ వంటి వస్తువులు కావాలంటూ డిమాండ్ చేసినట్లు చెప్పారు. ఇటీవల కుమార్తెను పుట్టింటికి తీసుకెళ్లినప్పటికీ, ఆమెపై దాడి చేసి జడను కత్తిరించాడని ఆవేదన వ్యక్తం చేశారు. అదనపు కట్నం కోసమే ఈ చర్యకు పాల్పడ్డాడని ఆరోపించారు.

భర్త తన భార్య ప్రాణానికి ముప్పు

ఇక, మరో ఘటనలో మేరఠ్‌ నగరానికి చెందిన ఓ భర్త తన భార్య ప్రాణానికి ముప్పుగా మారిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇన్సూరెన్స్ డబ్బు కోసం తనను చంపే కుట్ర చేస్తున్నదని ఆరోపించాడు. తన భార్యకు ఇతరులతో అక్రమ సంబంధాలున్నాయంటూ చాటింగ్ స్క్రీన్‌షాట్లు, వీడియోలు పోలీసులకు ఇచ్చాడు. తాను మర్చంట్‌ నేవీ ఆఫీసర్‌ని, తనపై 80 లక్షల బీమా ఉందని, అందుకే భార్య తనను చంపాలని చూస్తోందని వాపోయాడు. రెండు సంఘటనలూ మహిళల భద్రత, వివాహ బంధాల్లో ఏర్పడుతున్న విరోధాలపై ఆందోళన కలిగిస్తున్నాయి.

demanded fridge Google News in Telugu Harassed for dowry Man Cuts Wife Braid

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.