Engineering : రాష్ట్రంలో ఇంజనీరింగ్ సీట్లు (Engineering seats) నాలుగో వంతు ఖాళీగా ఉండిపోనున్నాయి. కన్వీనర్ కోటాలో విద్యార్థుల కంటే సీట్లే అధికంగా ఉండటంతో 34,298 సీట్లు మిగిలిపోయాయి. విశ్వవిద్యాలయాల్లోనూ 1,381 సీట్లు ఖాళీగా ఉన్నాయి. యాజమాన్య కోటా కలిపితే ఈ సంఖ్య మరింత భారీగా పెరుగుతుంది. ప్రభుత్వ కన్వీనర్ కోటా సీట్లకు సాంకేతిక విద్యా శాఖ రెండు విడతలుగా ఇ-కౌన్సిలింగ్ నిర్వహించింది. రెండు విడతలు పూర్తయిన తర్వాత చూస్తే…ప్రైవేటు కళాశాలల్లో ఏకంగా 31,811 సీట్లలో ఎవరూ చేరలేదు. ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లోనూ 1,126 సీట్లు మిగిలాయి. కౌన్సిలింగ్కు రిజిష్టర్ చేసుకున్న విద్యార్థుల కంటే సీట్లే అధికంగా ఉన్నాయి. ఇఎపి సెట్లో అర్హత సాధించిన విద్యార్థులు 1,84,248 మంది ఉండగా…వీరిలో కన్వీనర్ కోటాలో చేరేందుకు రిజిష్టర్ చేసుకున్న వారు 1,29,012 మంది. వీరిలో అర్హత సాధించిన వారు 1,28,712 మంది… కానీ ప్రైవేటు వర్సిటీలు, కళాశాలలు, ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో కలిపి కన్వీనర్ కోటా కింద 1,53,964 సీట్లు అందుబాటులో ఉన్నాయి. కౌన్సిలింగ్కు అర్హత సాధించిన వారందరికీ సీట్లు కేటాయించినా 25 వేలకు పైగా మిగిలే పరిస్థితి. కొంత మంది అభ్యర్థులు కోరుకున్న కళాశాలల్లో సీట్లు పొందకపోవడంతో మిగులు సంఖ్య మరింత పెరిగింది. ప్రైవేటు కళాశాలల్లో కన్వీనర్ కోటా కింద 70% కాగా యాజమాన్య కోటా 30% ఉంటుంది. ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో ఇది 35%, 65%గా ఉంది. యాజమాన్య కోటా సీట్లలోనూ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ (సిఎస్ఈ) మినహా మిగతా బ్రాంచిల్లో సీట్లు భారీగా మిగిలాయి. అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఎఐసిటిఇ) సీట్లు, కొత్త కళాశాలల మంజూరుపై స్టే నిషేధం ఎత్తివేసింది. మౌలిక సదుపాయాలు చూపిస్తే సీట్లు మంజూరు చేస్తోంది. డీమ్డ్ విశ్వవిద్యాలయాల్లో వంద శాతం సీట్లను యాజమాన్యమే భర్తీ చేసుకుంటోంది.
ఎఐసిటిఇ డీమ్డ్ టు బీ వర్సిటీలకు కొత్త అనుమతులు ఇస్తోంది. చాలా మంది వీటిలోనూ ప్రవేశాలు పొందుతున్నారు. ఆయా వర్సిటీలు ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహించుకుంటున్నాయి. సిఎస్ఇ బ్రాంచికి డిమాండ్ ఉండటంతో ఇప్పుడు అన్ని విద్యా సంస్థల్లోనూ ఈ సీట్లే అధికంగా ఉన్నాయి.ఈ ఎపి సెట్లో టాప్ ర్యాంకులు సాధించిన విద్యార్థులు స్థానికంగా ప్రవేశాలు పొందడం లేదు. ఎన్ఐటి, ఐఐటి, ట్రిపుల్ఎటిలు లేదా ఇతర రాష్ట్రాల్లోని పేరొందిన వర్సిటీలు, కళాశాలల్లో చేరుతున్నారు. ఈఎపిసెట్లో 200 లోపు ర్యాంకుల్లో ఇద్దరు, టాప్-500 ర్యాంకుల్లో 12 మంది మాత్రమే కౌన్సిలింగ్లో పాల్గొన్నట్లు సమాచారం.
READ HINDI NEWS : hindi.vaartha.com
READ ALSO :