బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ (Hrithik Roshan) మరోసారి వార్తల్లో నిలిచారు. తన వ్యక్తిగత హక్కుల రక్షణ కోసం న్యాయపరమైన చర్యలు తీసుకున్నారు. తన పేరు, ఫోటోలు, వాయిస్, ఇమేజ్‌ను అనుమతి లేకుండా వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నారని ఆరోపిస్తూ హృతిక్ (Hrithik Roshan) ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.
Read Also: OG: ఓటీటీ లోకి ‘ఓజీ’ సినిమా ఎప్పుడంటే?
ఈ పిటిషన్‌ను బుధవారం (నేడు) జస్టిస్ మన్మీత్ ప్రీతమ్ సింగ్ ఆరోరా విచారించనున్నారు.గతంలో ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్, నాగార్జున హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఆయా పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు ఐశ్వర్య రాయ్, అభిషేక్, నాగ్‌లకు అనుకూలంగా ఉత్తర్వులు జారీ చేసింది.
పేర్లు, ఫొటోలు, వాయిస్‌ను అనధికారికంగా ఉపయోగించకుండా నిషేధం విధించింది. అలాగే, బాలీవుడ్ ఫేమస్ సింగర్ కుమార్ సాను సైతం ఢిల్లీ హైకోర్టు (High Court of Delhi) ను ఆశ్రయించారు. ఏఐ (AI) ని ఉపయోగించి తన వాయిస్‌ను అనుకరిస్తున్నారని.. తన హక్కులను ఉల్లంఘించడమేనన్నారు. అదే సమయంలో సునీల్ శెట్టి (Sunil Shetty) సైతం తన హక్కులను కాపాడాలని బాంబే హైకోర్టు (High Court of Bombay) ను ఆశ్రయించారు.
హృతిక్ రోషన్ నటించిన సినిమాల్లో మీకు ఇష్టమైన సినిమా ఏది?
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: