📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Latest News: Hrithik Roshan: హృతిక్‌ రోషన్‌కు హైకోర్టులో భారీ ఊరట

Author Icon By Anusha
Updated: October 15, 2025 • 3:59 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బాలీవుడ్ అగ్ర క‌థానాయ‌కుడు హృతిక్ రోషన్ (Hrithik Roshan) తన వ్యక్తిగత హక్కుల రక్షణ కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఇటీవల ఆయన దాఖలు చేసిన పిటిషన్‌లో, తన అనుమతి లేకుండా వాణిజ్య ప్రయోజనాల కోసం తన పేరు, ఫోటోలు, వాయిస్ ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. దీనిపై కోర్టు (High Court of Delhi) కీలక ఆదేశాలను జారీ చేసింది, హృతిక్ కు ఊరట లభించింది.

Read Also: Bigg Boss 9: డేంజర్‌ జోన్‌లోకి ప్రవేశించిన టాప్ కంటెస్టంట్స్

హృతిక్ రోషన్ తన Personality Rights (వ్యక్తిత్వ హక్కులు)ను కాపాడేందుకు ఈ కేసు దాఖలు చేశారు. పిటిషన్‌లో ఆయన పేర్కొన్న ముఖ్య అంశాల ప్రకారం, కొందరు వ్యక్తులు, ఈ-కామర్స్ సంస్థలు AI (Artificial Intelligence) సాంకేతికతను ఉపయోగించి ఆయన ఫోటోలు, వాయిస్ మార్ఫింగ్ చేసి, వాణిజ్య ఉత్పత్తులను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు.

ఈ చర్యలు ఆయన ప్రతిష్ఠ, బ్రాండ్ విలువ, వ్యక్తిగత గుర్తింపుపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి.AI ఆధారిత కంటెంట్ ఉత్పత్తి వేగంగా పెరుగుతున్న సమయంలో, హీరోలు, సేలబ్రిటీలు తమ వ్యక్తిగత హక్కులను కాపాడుకోవడం అత్యంత అవసరం.

ఈ కేసును విచారించిన న్యాయస్థానం

హృతిక్ రోషన్ (Hrithik Roshan)ఈ తరహా అభ్యంతరకరమైన కంటెంట్‌ను ఆపివేయాలని, తన పేరును, ఇమేజ్‌ను అనుమతి లేకుండా వాడే వ్యక్తులపై నిషేధం విధించాలని కోర్టుకు అభ్యర్థించారు.

Hrithik Roshan

అయితే హృతిక్ పిటిష‌న్ నేడు విచార‌ణ‌కు రాగా.. ఈ కేసును విచారించిన న్యాయస్థానం హృతిక్ రోషన్‌కు అనుకూలంగా తీర్పునిచ్చింది. ఇకపై హృతిక్‌ అనుమతి లేకుండా ఆయన పేరు కానీ, ఫోటోలు, వాయిస్ లేదా ఇతర వ్యక్తిగత లక్షణాలను వాణిజ్య ప్రయోజనాలకు వాడుకోవడానికి వీల్లేదని ఆదేశించింది.

తక్షణమే తొలగించాలని

అలాగే ఈ-కామర్స్ వెబ్‌సైట్‌ (E-commerce website) లలో హృతిక్ రోషన్‌కి సంబంధించిన‌ ఫోటోలు, ఆయనకు సంబంధించిన అభ్యంతరకరమైన ఏఐ (AI) జనరేటెడ్ కంటెంట్ లింక్‌లను తక్షణమే తొలగించాలని న్యాయస్థానం సంబంధిత సంస్థలకు ఆదేశించింది.

కాగా, ఇటీవల తెలుగు నటుడు నాగార్జునతో పాటు ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్, కరణ్ జోహార్ వంటి పలువురు సెలబ్రిటీలు కూడా తమ వ్యక్తిత్వ హక్కుల (Personality Rights) రక్షణ కోసం కోర్టులను ఆశ్రయించిన విష‌యం తెలిసిందే.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

AI content misuse Breaking News Delhi High Court Hrithik Roshan latest news personality rights Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.