📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

HPV Vaccine: దేశవ్యాప్తంగా బాలికలకు ఉచిత HPV వ్యాక్సిన్

Author Icon By Aanusha
Updated: February 25, 2026 • 12:31 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

HPV Vaccine: మహిళల్లో ప్రాణాంతకంగా మారుతున్న గర్భాశయ (సర్వైకల్) క్యాన్సర్‌ను ఆదిలోనే అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా 14 ఏళ్ల లోపు వయసున్న అమ్మాయిలకు ఉచితంగా హ్యూమన్ పాపిల్లోమా వైరస్ (HPV) వ్యాక్సిన్ వేయాలని నిశ్చయించింది. ఈ మేరకు ప్రభుత్వ వర్గాలు వెల్లడించిన సమాచారం ప్రకారం, త్వరలోనే అన్ని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలు, పాఠశాలల ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.

Keralam State Name Change: కేరళ పేరును ‘కేరళమ్‌’ మార్పుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

గార్డసిల్ (Gardasil) ఇంజెక్షన్ ఉచితం

ఆరోగ్య కేంద్రాల్లో గార్డాసిల్‌ ఇంజెక్షన్‌ను ఉచితంగా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
ఈ టీకా నాలుగు రకాల గర్భాశయ కేన్సర్లను నిరోధిస్తుంది. ఈ కేన్సర్‌కు కారణమయ్యే HVP టైప్‌ 16, 18 తోపాటు 6, 11 రకాల నుంచి టీకా రక్షణ కల్పిస్తుందని ఆరోగ్యశాఖ వర్గాలు పేర్కొన్నాయి.ఒక డోసుతో బాలికలకు దీర్ఘకాల రక్షణ కల్పిస్తుందని పలు శాస్త్రీయ పరిశోధనల్లో వెల్లడయ్యింది.

జాతీయ ఆరోగ్య కార్యక్రమంలో భాగంగా హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ను స్వచ్ఛందంగా, ఉచితంగా అందివనున్నన్నారు. ప్రపంచంలో అత్యధికంగా గర్బాశయ ముఖద్వార కేన్సర్ బాధితులు చైనా, అమెరికా తర్వాత భారత్‌‌లోనే ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ఏడాదికి 2 కోట్ల మంది కేన్సర్ బారిన పడుతుండగా.. ఇందులో భారతీయులనే 15 లక్షల మంది ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.

HPV vaccine for girls across the country

2030 నాటికి నిర్మూలించడమే లక్ష్యం

2030 నాటికి భారత్‌లో మహిళలెవ్వరూ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ బారిన పడకుండా నిర్మూలించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా దేశవ్యాప్తంగా భారీ వ్యాక్సినేషన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల సర్వైకల్ క్యాన్సర్ బారిన పడకుండా ఉంటారు. దీని వల్ల భారత్‌లో కేన్సర్ ముప్పు తగ్గుతుంది. 30 ఏళ్లలోపు మహిళలు ఈ టీకాను తీసుకోవడం వల్ల క్యాన్సర్ బారిన భవిష్యతులో పడే అవకాశం తక్కువగా ఉంటుందని అంతర్జాతీయ పరిశోధనల్లో వెల్లడైంది.

ప్రస్తుతం దేశంలో తమిళనాడులో 14 ఏళ్ల బాలికలందరికీ హెచ్‌పీవీ వ్యాక్సిన్ అందించారు. దేశంలో బాలికలందరికీ వ్యాక్సిన్ అందించిన తొలి రాష్ట్రంగా తమిళనాడు నిలిచింది. ఇక తెలంగాణలో కూడా ఈ వ్యాక్సిన్ అందించే కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల శ్రీకారం చుట్టింది. తెలంగాణలో కూడా సర్వైకల్ క్యాన్సర్ బారిన ఎక్కువమంది పడుతున్నారు. దీంతో కట్టడి చేసేందుకు ఉచితంగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ అందించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Free Cervical Cancer Vaccine Gardasil Injection HPV Vaccine India

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.