हिन्दी | Epaper
ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Honeymoon murder: మా అబ్బాయి నిర్దోషి అంటున్న తల్లి, సోదరి

Sharanya
Honeymoon murder: మా అబ్బాయి నిర్దోషి అంటున్న తల్లి, సోదరి

మేఘాలయ రాష్ట్రంలోని పర్యాటక ప్రదేశం సమీపంలో సంచలనం రేపిన హనీమూన్ హత్య (Honeymoon murder) కేసు ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇండోర్‌కు చెందిన వ్యాపారవేత్త రాజా రఘువంశీ మృతదేహం జూన్ 2న ఒక లోతైన లోయలో గుర్తించబడింది.

ఇండోర్‌కు చెందిన రాజా రఘువంశీ (Raja Raghuvanshi) , అతని భార్య సోనమ్ హనీమూన్ కోసం మేఘాలయ వెళ్లారు. అక్కడ మే 23న తూర్పు ఖాసీ హిల్స్‌లోని సోహ్రా ప్రాంతంలో వీరిద్దరూ అదృశ్యమయ్యారు. అనంతరం జూన్ 2న రాజా రఘువంశీ మృతదేహాన్ని ఒక లోతైన లోయలో పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు, భర్త హత్యకు సోనమ్ కుట్ర పన్నిందని ఆరోపించారు.

హత్యకు కుట్ర – సోనమ్ పాత్రపై ఆరోపణలు

పోలీసుల ప్రకారం, ఈ హత్య ముందస్తు ప్రణాళిక ప్రకారమే జరిగిందని అనుమానం. రాజా రఘువంశీని హత్య చేయడంలో సోనమ్ ప్రణాళిక రచించిందని, అందులో భాగంగా రాజ్ కుష్వాహాతో పాటు మరికొందరి సహాయంతో హత్య చేయించిందని పోలీసులు తెలిపారు. ఈ ఆరోపణలతో జూన్ 9న ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్‌లో ఒక రోడ్డు పక్కన దాబాలో సోనమ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

రాజ్ కుష్వాహా అమాయకుడు – కుటుంబ సభ్యుల భావోద్వేగ స్పందన

ఇండోర్‌కు చెందిన 20 ఏళ్ల రాజ్ కుష్వాహా ప్రస్తుతం పోలీసులు అదుపులో ఉన్నాడు. అయితే, అతని తల్లి మాట్లాడుతూ “నా కొడుకు అమాయకుడు. పోలీసులు అతన్ని అన్యాయంగా తీసుకెళ్లారు. పోలీసులు చెప్తున్నవన్నీ అబద్ధాలు. అందులో ఎలాంటి నిజం లేదు. నా కొడుకు అలాంటి పని ఎప్పటికీ చేయడు” అని కన్నీటిపర్యంతమయ్యారు. రాజ్ వయసు కేవలం 20 సంవత్సరాలని, అతను సోనమ్ సోదరుడి ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడని ఆమె తెలిపారు.

కోవిడ్ సమయంలో రాజ్ తండ్రి మరణించారని, అప్పటి నుంచి ఇంటికి రాజ్ ఒక్కడే ఆధారం అని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్ తల్లితో పాటు ముగ్గురు సోదరీమణులు ఉన్నారు. “నా తమ్ముడు ఎలాంటివాడో నాకు తెలుసు. అతను ఇలాంటి దారుణానికి పాల్పడడు. ఇవన్నీ కట్టుకథలు” అని రాజ్ సోదరి అన్నారు. “నా తమ్ముడు ఎక్కడికీ వెళ్లలేదు. మీరు అతని ఆఫీసులో వాళ్ల‌ని అడగవచ్చు. అతను రోజూ తన ఆఫీసుకి గోడౌన్‌కి వెళ్లేవాడు” అని ఆమె మాట్లాడుతూ అన్నారు. అలాగే ఈ ఘ‌ట‌న జరిగినప్పుడు రాజ్ ఇంట్లోనే ఉన్నాడని ఆమె పేర్కొన్నారు.

వృత్తిపరమైన సంబంధమే – వివాహేతర అనుమానాలు తిప్పికొట్టిన కుటుంబం

సోనమ్‌తో రాజ్‌కు ఎలాంటి వ్యక్తిగత సంబంధం లేదని, కేవలం ఉద్యోగ సంబంధమే ఉండేదని కుటుంబం స్పష్టం చేసింది. రాజ్ కుష్వాహాకు, సోనమ్ రఘువంశీకి మధ్య వివాహేతర సంబంధం ఉందని పోలీసు వర్గాలు ఆరోపిస్తున్నాయి.

పోలీసుల దర్యాప్తు వేగవంతం – సీబీఐ విచారణ కోరికలు

ఈ హత్యకేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో, ఇప్పటికే మీడియా, సామాజిక మాధ్యమాల్లో స్పందనలు వెల్లువెత్తుతున్నాయి. హనీమూన్ ట్రిప్‌లో జరిగిన ఈ దారుణ హత్య వెనుక ఉన్న పూర్తి వాస్తవాలను వెలికితీసేందుకు పోలీసులు దర్యాప్తు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. ఈ కేసు అనేక మలుపులు తిరుగుతుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Read also: Honeymoon Murder: పెళ్లైన ఐదో రోజు నుంచే హత్యకు స్కెచ్‌

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870