📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Honey Trap :హనీ ట్రాప్ లో మరో ఉద్యోగి వరుస ఘటనలతో తలపట్టుకున్న నిఘా వర్గాలు

Author Icon By Anusha
Updated: March 15, 2025 • 12:42 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఉత్తరప్రదేశ్ యాంటీ-టెర్రరిజం స్క్వాడ్ (UP ATS) ఆయుధ కర్మాగారానికి చెందిన ఉద్యోగిని అదుపులోకి తీసుకుంది. ఫిరోజాబాద్‌లోని హజ్రత్‌పూర్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో ఛార్జ్‌మెన్‌గా పనిచేస్తున్నరవీంద్ర కుమార్‌ను పాకిస్తాన్‌కు రహస్య సమాచారాన్నిలీక్ చేసిన ఆరోపణలపై అరెస్ట్ చేశారు.అతను పాకిస్తాన్ నిఘాసంస్థకు చెందిన మహిళా ఏజెంట్‌ హనీ ట్రాప్‌లో చిక్కుకుని భారత రక్షణ శాఖకు సంబంధించిన కీలకమైన సమాచారాన్ని అందించినట్లు అధికారులు గుర్తించారు.

ఐఎస్ఐఎకి సమాచారం

ఉత్తరప్రదేశ్ ఏటీఎస్ చీఫ్ నీలాబ్జా చౌదరి తెలిపిన వివరాల ప్రకారం,రవీంద్ర 2006 నుంచి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో పనిచేస్తూ, 2009లో హజ్రత్‌పూర్ ఫ్యాక్టరీకి బదిలీ అయ్యాడు.‘నేహా శర్మ’ అనే మారు పేరుతో ఉన్న ఓ మహిళ ద్వారా ఐఎస్ఐఎకి సమాచారం చేరవేస్తున్నట్టు గుర్తించారు. గగన్‌యాన్ అంతరిక్ష ప్రాజెక్ట్, మిలిటరీ లాజిస్టిక్స్-డెలివరీ డ్రోన్ ట్రయల్స్‌కు సంబంధించిన రహస్య వివరాలను కూడా అతను చేరవేసినట్లు గుర్తించారు. ఈ వ్యవహారంలో రవీంద్ర కుమార్‌కు సహకరించిన మరొక వ్యక్తిని కూడా అరెస్టు చేశారు.

ఫేస్‌బుక్ ద్వారా 

ఫేస్‌బుక్ ద్వారా నేహా శర్మతో రవీంద్ర కుమార్‌ కు పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత వారి మధ్య వాట్సాప్ చాటింగ్ మొదలైంది.ఆన్‌లైన్ స్నేహం కాస్తా వ్యక్తిగత విషయాలు, దేశ రహస్యాలు పంచుకునే వరకు చేరింది. ఈ క్రమంలోనే రవీంద్ర కుమార్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీకి సంబంధించిన కీలక సమాచారాన్ని నేహాతో పంచుకున్నాడు.

చందన్ స్టోర్ కీపర్ 2

హనీ ట్రాప్ పద్ధతులను ఉపయోగించి ఐఎస్ఐ మహిళా ఏజెంట్లు పురుషులను ఆకర్షిస్తారని, వారి నుంచి సున్నితమైన సమాచారాన్ని సేకరిస్తారని ఏటీఎస్ చీఫ్ నీలాబ్జా చౌదరి తెలిపారు. రవీంద్ర కుమార్ తన ఫోన్‌ కాంటాక్ట్ లిస్టులో ఆ మహిళ నెంబర్ ను ‘చందన్ స్టోర్ కీపర్ 2’ పేరుతో సేవ్ చేసుకున్నాడని చెప్పారు.

వాట్సాప్ ద్వారా

ఆర్థిక ప్రోత్సాహకాలతో ప్రేరేపించిన, అతను వాట్సాప్ ద్వారా ఆమెకు రహస్య పత్రాలను పంపాడని నిర్ధారించారు.సోదాల సమయంలో, యుపి ఎటిఎస్ రవీంద్ర మొబైల్ ఫోన్‌లో సున్నితమైన సమాచారాన్ని కనుగొంది. వాటిలో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, 51 గూర్ఖా రైఫిల్స్ రెజిమెంట్ సీనియర్ అధికారులు నిర్వహించిన లాజిస్టిక్స్ డ్రోన్ ట్రయల్స్ గురించిన రహస్య వివరాలు ఉన్నాయి.

ఐఎస్‌ఐ హ్యాండ్లర్లు

అతను పాకిస్తాన్‌కు చెందిన ఐఎస్‌ఐ హ్యాండ్లర్లతో ప్రత్యక్ష సంభాషణను కొనసాగించాడని, భారతదేశ రక్షణ ప్రాజెక్టులకు సంబంధించిన నిఘా సమాచారాన్ని అందజేశాడని అధికారులు చెబుతున్నారు. అతని అరెస్టు తర్వాత, ATS అధికారులు ఆగ్రా నుండి రవీంద్ర సహచరులలో ఒకరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. వాట్సాప్ చాట్‌లు, వర్గీకృత పత్రాలతో సహా డిజిటల్ ఆధారాలను ఏజెన్సీ స్వాధీనం చేసుకుంది. వీటిని ఇప్పుడు దర్యాప్తులో భాగంగా విశ్లేషిస్తున్నారు.

#ATS #CyberEspionage #DefenseSecrets #Espionage #HoneyTrap #indianarmy #ISI #ISRO #NationalSecurity #OrdnanceFactory #PakistanSpy #SecurityBreach #UttarPradesh Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.