📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Hindu Communities :మరోసారి మహారాష్ట్ర ముస్లిం సంఘాలను హెచ్చరించిన హిందూ సంఘాలు

Author Icon By Anusha
Updated: March 17, 2025 • 11:14 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీ నగర్ జిల్లా కుల్దాబాద్ ప్రాంతంలో ఉన్న మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ సమాధిని వెంటనే తొలగించాలని విహెచ్‌పీ (విశ్వ హిందూ పరిషత్), భజరంగ్ దళ్ డిమాండ్ చేశాయి. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోకపోతే, 1992లో కరసేవకులు బాబ్రీ మసీదును కూల్చినట్లుగానే, ఈ సమాధిని తాము తొలగిస్తామని హెచ్చరించారు.ఈ నేపథ్యంలో, మహారాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఛత్రపతి శంభాజీ నగర్ జిల్లాలోని ఔరంగజేబ్ సమాధి వద్ద భద్రతను కట్టుదిట్టం చేసింది. పోలీసు విభాగాలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

వీహెచ్‌పీ, భజరంగ్ దళ్ డిమాండ్ 

ఔరంగజేబ్ సమాధి నాటి వెట్టి చాకిరీకి, బానిసత్వానికి, మొఘలుల పాలనలో హిందువులపై జరిగిన వేధింపులకు చిహ్నమని వీహెచ్ పీ, భజరంగ్ దళ్ స్థానిక నేతలు కిషోర్ చవాన్, నితిన్ మహాజన్, సందేశ్ భెగ్డేలు ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని కలెక్టరేట్లు, తహసీల్దార్ కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించుకున్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు ఈ డిమాండ్‌ను తెలియజేసేలా వినతిపత్రాలు సమర్పించనున్నట్టు ప్రకటించారు.

శివసేన (ఏక్‌నాథ్ శిండే వర్గం) మద్దతు

ఔరంగజేబ్ సమాధిని తొలగించాలన్న డిమాండ్ కు శివసేన (ఏక్ నాథ్ శిండే వర్గం) మద్దతు తెలిపింది.ప్రజలను వేధింపులకు, అణచివేతకు గురిచేసిన పాలకుడి సమాధిని ప్రత్యేక భద్రత పెట్టి మరీ కాపాడాల్సిన అవసరం ఏంటని మంత్రి సంజయ్ శిర్సత్ ప్రశ్నించారు.

ప్రభుత్వ చర్యలు ,భద్రతా ఏర్పాట్లు

వీహెచ్‌పీ, భజరంగ్ దళ్ హెచ్చరికలతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.ఔరంగజేబ్ సమాధి వద్ద భద్రతను పెంచి, పోలీసు బందోబస్తును మరింత కట్టుదిట్టం చేసింది.అంతేకాదు, రాష్ట్రవ్యాప్తంగా ప్రతికూల ప్రభావం పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది.మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్, మరాఠా సామ్రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ మధ్య విపరీతమైన శత్రుత్వం కొనసాగింది.శివాజీ హిందువుల హక్కుల కోసం పోరాడుతూ మొఘల్ పాలనకు ఎదురు నిలిచారు.చారిత్రక విభేదాలు, సామాజిక అసమానతలు మత ఘర్షణలకు ప్రధాన కారణాలు. ఇలాంటి ఘర్షణలు దేశానికి తీవ్ర నష్టం కలిగిస్తాయి.మతపరమైన వివాదాలు ఎంతో మంది అమాయక ప్రజల ప్రాణాలను బలితీసుకుంటాయి, సామాజిక శాంతి భద్రతలకు భంగం కలిగిస్తాయి.

#Aurangabad #AurangzebTomb #BajrangDal #Fadnavis #Hindutva #HistoricalDebate #MaharashtraPolitics #ShivSena #VHP Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.