Hindi language : మహారాష్ట్రకు చేరిన హిందీ వివాదం..ప్రభుత్వం ఉత్తర్వులపై విపక్షాల ఆగ్రహం

Read Time:  1 min
Hindi controversy reaches Maharashtra.. Opposition agreed by government orders
Hindi controversy reaches Maharashtra.. Opposition agreed by government orders
FONT SIZE
GET APP

Hindi language : హిందీ భాషను బలవంతంగా రుద్దుతున్నారనే వివాదం తమిళనాడు, కర్ణాటకల నుంచి మహారాష్ట్రకు వ్యాపించింది. మహారాష్ట్రలో మరాఠీ, ఇంగ్లిష్‌ మీడియం పాఠశాలల్లో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు మూడో భాషగా హిందీని తప్పనిసరిగా బోధించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై కాంగ్రెస్‌, ఎంఎన్‌ఎస్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

మహారాష్ట్రకు చేరిన హిందీ వివాదం

కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న చర్య ఆగ్రహం

ఎంఎన్‌ఎస్‌ చీఫ్‌ రాజ్‌ ఠాక్రే ఎక్స్‌లో స్పందిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వంతోపాటు కేంద్ర ప్రభుత్వంపైన కూడా విరుచుకుపడ్డారు. త్రిభాషా సూత్రాన్ని ప్రభుత్వ వ్యవహారాలకే పరిమితం చేసుకోవాలని, విద్య విషయంలో దానిని తీసుకురావద్దని హెచ్చరించారు. మహారాష్ట్రలో ప్రతి దానినీ హిందీయీకరణ చేయడానికి కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలను అనుమతించేది లేదన్నారు.

నోటిఫికేషన్‌ను తక్షణమే ఉపసంహరించాలని డిమాండ్‌

మరాఠీ, మరాఠీయేతరుల మధ్య ఘర్షణను సృష్టించి, రానున్న ఎన్నికల్లో లబ్ధి పొందడానికి ప్రయత్నిస్తున్నారా? అని నిలదీశారు. కాంగ్రెస్‌ శాసన సభా పక్ష నేత విజయ్‌ వడెట్టివార్‌ స్పందిస్తూ, ఈ నోటిఫికేషన్‌ను తక్షణమే ఉపసంహరించాలని డిమాండ్‌ చేశారు.

Read Also: బెంగాల్ 25వేల మంది టీచర్లకు సుప్రీంకోర్టు ఊరట

sumalatha chinthakayala

రచయిత గురించి

sumalatha chinthakayala

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.