📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం

Himalayan glaciers : వేగంగా కరుగుతున్న హిమానీనదాలు !

Author Icon By Sudha
Updated: August 15, 2025 • 4:52 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

వాతావరణ మార్పులతో ఇప్పటికే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న మానవాళికి త్వరలోనే మరో ముప్పు(threat) ఎదురవ్వనుంది. ఏడాదికేడాది పెరిగిపోతున్న భూతాపం కారణంగా హిమాలయ ప్రాంతంలోని మంచు వేగంగా కరుగుతోంది. ఫలితంగా భారీగా వరదలు సంభవించే అవకాశముందని అడ్వాన్సింగ్ ఎర్త్ స్పేస్ సైన్స్ (AGS) అధ్యయనం హెచ్చరిస్తోంది. గత పదేళ్లుగా అక్కడి గ్లేషియర్స్ పరిమాణం తగ్గుతూ వస్తోందని ఇది భవిష్యత్‌లో తీవ్ర విపత్తులకు దారి తీయనుందని ఏజీయూ స్టడీ పేర్కొంది. ఫలితంగా అక్కడి సింధు, యాంగ్జే, అము డార్యా, సిర్ దర్యా వంటి నదుల్లో పది శాతం నీటి పరిమాణం పెరిగిందని వెల్లడించింది.

Himalayan glaciers : వేగంగా కరుగుతున్న హిమానీనదాలు !

‘హిమానీ నదుల్లో ( Himalayan glaciers) నీటి శాతం పెరగడం వల్ల స్వల్ప కాలికంగా జలవిద్యుఛక్తి, వ్యవసాయానికి లాభదాయకంగా ఉంటుంది. కానీ, దీర్ఘ కాలికంగా గ్లేసియర్స్ అనేవి కనుమరుగు అవుతాయి. నదీ వ్యవస్థకు రక్షణలా ఉండే ఇవి కుచించుకుపోవడం వల్ల భవిష్యత్‌లో నీటి లభ్యతలో ఇబ్బందులు ఎదురవ్వడం ఖాయం. అంతేకాదు జలచరాలపై కూడా తీవ్ర ప్రభావం పడుతుంది’ అని మసాచుసెట్స్ యూనివర్సిటీకి చెందిన ఇంజనీర్ జొనాథన్ ఫ్లొరెస్ అన్నాడు.హిమాలయ ప్రాంతంలోని మంచుపై కాలుష్యం ప్రభావం – మానవాళిపై దాని దుష్ఫరిణామాలపై ఏజీయూ పరిశోధకులు అధ్యయనం చేశారు. హిమాలయ ప్రాతంలోని నదీ వ్యవస్థలో చోటుచేసుకుంటున్న మార్పులను నోట్ చేశారు. వీళ్ల స్టడీ ప్రకారం 2100 నాటికి హిమానీనదాల ( Himalayan glaciers)శాతం 29 నుంచి 67 శాతం వరకూ తగ్గే అవకాశముందని పరిశోధకులు చెబుతున్నారు. క్లోరోఫ్లోరో కార్బన్‌ల కారణంగా భూతాపం పెరుగుతుండడం వల్ల మంచు కరిగి నదుల్లో నీటి శాతం ఎక్కువవుతోంది. ఫలితంగా నదీ తీర ప్రాంతాల్లో నివసించే ప్రజలు, లోతట్టు ప్రాంతాల్లో నివసించేవారు తీవ్ర దుష్ఫరిణామలు ఎదుర్కోంటారని ఏజీయూ పరిశోధకులు అంటున్నారు.

హిమాలయాలలో ఎన్ని హిమానీనదాలు ఉన్నాయి?

హిమాలయాలలో దాదాపు 15,000 హిమానీనదాలు ఉన్నాయి. ప్రతి వేసవిలో, ఈ హిమానీనదాలు కరిగే నీటిని సింధు, గంగా మరియు బ్రహ్మపుత్ర నదులలోకి విడుదల చేస్తాయి. దాదాపు 500 మిలియన్ల మంది ఈ మూడు నదుల నీటిపై ఆధారపడతారు.

హిమాలయాల ప్రధాన హిమానీనదం ఏది?

భారతదేశంలోని హిమాలయ ప్రాంతం ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ హిమానీనదాలకు నిలయంగా ఉంది, వాటిలో భూమిపై రెండవ అతిపెద్ద ధ్రువేతర హిమానీనదం మరియు భారతదేశంలో అతిపెద్ద హిమానీనదం అయిన సియాచిన్ హిమానీనదం కూడా ఉంది.

ఏ మూడు నదులు హిమాలయాల నుండి ఉద్భవించాయి?

హిమాలయ నదులు ( గంగా, బ్రహ్మపుత్ర, సింధు ) మంచు మరియు హిమానీనదాలు కరగడం వల్ల, అలాగే వర్షపాతం వల్ల ఏర్పడతాయి మరియు అందువల్ల, ఏడాది పొడవునా నిరంతర ప్రవాహం ఉంటుంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/jk-pilgrims-killed-in-flash-floods-in-jammu-and-kashmir/crime/530620/

Breaking News Climate Change Environmental Crisis Glacier Melting Global Warming Himalayan Glaciers latest news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.