📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Himachal Pradesh: ఒకే మహిళను పెళ్లాడిన ఇద్దరు అన్నదమ్ములు..వీడియో వైరల్

Author Icon By Sharanya
Updated: July 20, 2025 • 1:31 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

సామాన్యంగా పెళ్లి అనగానే ఒక వధువు, ఒక వరుడు అని మనకు తెలుసు. కానీ హిమాచల్‌ ప్రదేశ్‌ (Himachal Pradesh) లోని శిమ్లా జిల్లా ఈ సాంప్రదాయం ఒక విశేష ఘటనకు వేదికైంది. కున్హాట్ గ్రామానికి చెందిన సునీత అనే యువతిని, షిల్లాయ్ గ్రామానికి చెందిన ఇద్దరు సోదరులు ప్రదీప్, కపిల్ నేగి ఒకే వేదికపై వివాహం చేసుకుని వార్తల్లో నిలిచారు.

వందలాది మంది సమక్షంలో వివాహ వేడుక

ఈ వివాహ వేడుకకు బంధుమిత్రులతో పాటు గ్రామస్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. మండపంలో ఒకే వధువుతో ఇద్దరు అన్నదమ్ముల (Two brothers with the same bride)పెళ్లి ఘనంగా జరగడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఇది మా తెగ సంప్రదాయమే: వధూవరుల స్పష్టం

ఈ వివాహం గురించి మాట్లాడిన ప్రదీప్, కపిల్, సునీత – ముగ్గురూ ఈ పెళ్లి తమ అనుమతితో, పూర్తిగా చర్చల అనంతరం జరిగినదని చెప్పారు. ‘‘ఇది మా తెగలో గతంలో ఉన్న సంప్రదాయం. కొన్ని సంవత్సరాలుగా పాటించకపోయినా, మేం మళ్లీ ఆ సంప్రదాయాన్ని జీవితం లోకి తీసుకురావాలని నిర్ణయించుకున్నాం’’ అని వారు తెలిపారు. హిమాలయ ప్రాంతంలోని కొన్ని తెగల్లో, అలాగే తమిళనాడులోని నీలగిరి కొండ ప్రాంతాల్లో (In the Nilgiri hills) నూ ఇలాంటి బహుభర్తృత్వపు వివాహాలు ఇప్పటికీ కనిపిస్తాయి. వనరుల కొరత (భూమి, ఆస్తులు) కారణంగా కుటుంబం చీలిపోకుండా ఉండేందుకు అన్నదమ్ములు ఒకే యువతిని వివాహం చేసుకునే సంప్రదాయం అక్కడ ఉంది.

వివాహానంతరం భవిష్యత్ స్పష్టత

ప్రదీప్ ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగం చేస్తుండగా, కపిల్ నేగి విదేశాల్లో పనిచేస్తున్నారు. తన భార్యతో ఎక్కువ రోజులు కలిసి ఉండలేనందున, ఈ విధమైన వివాహం తమ మానసిక బంధాన్ని మరింత బలపరిచిందని కపిల్ అభిప్రాయపడ్డారు. సునీతను ఇద్దరం కలిసి గౌరవిస్తూ, సమానమైన ప్రేమతో జీవితం కొనసాగించనున్నామని అన్నదమ్ములు తెలిపారు.

సోషల్ మీడియాలో కలకలం

ఈ సంఘటనపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన వస్తోంది. కొందరు ఇది తెగ సంప్రదాయాన్ని గౌరవించడం అంటూ సమర్థిస్తుండగా, మరికొందరు దీన్ని సాంఘిక సమాజ విలువల పట్ల తేడాగా చూస్తున్నారు. అయినా, ఈ వివాహం తమ ముగ్గురి సమ్మతితోనే జరిగిందని, ఎటువంటి బలవంతం లేనని వారు స్పష్టం చేశారు. కుటుంబానికి ఉన్న పరిమిత వనరులు (భూమి, ఇతర ఆస్తులు), కుటుంబం ముక్కలు కాకుండా అన్నదమ్ములు (ఇద్దరు లేదా ముగ్గురు) ఒకే యువతిని వివాహం చేసుకోవడం వెనకున్న కారణమని ఈ తెగ పెద్దలు చెబుతున్నారు. 

అంతర్జాతీయంగా కూడా కనిపిస్తున్న ప్రాచీన సంప్రదాయాలు

ఇలాంటి బహుభర్తృత్వ సంప్రదాయాలు భారతదేశానికి మాత్రమే పరిమితమైనవికాదు. ఆఫ్రికా ఖండంలోని కొన్ని దేశాల్లో కూడా ఈ విధమైన వివాహ విధానాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయని ప్రజాశక్తి వర్గాలు చెబుతున్నాయి. గత ఐదేళ్లలో హిమాచల్ (Himachal Pradesh), ఉత్తరాఖండ్ ప్రాంతాల్లో కనీసం ఆరు ఇలాంటి వివాహాలు నమోదయ్యాయని సమాచారం .

Read hindi news: hindi.vaartha.com

Read also: Odisha: ఒడిశాలో దారుణం.. బాలికను సజీవదహనం చేసేందుకు యత్నించిన దుండగులు

Breking news Himachal pradesh Himachal Wedding latest news Telugu News Tribal Marriage Two Brothers One Bride Unusual Marriage Viral Video

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.