📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్! ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్!

Himachal Pradesh snowfall : హిమాచల్‌లో భారీ మంచు! 1200కి పైగా రోడ్లు మూసివేత

Author Icon By Sai Kiran
Updated: January 29, 2026 • 7:38 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Himachal Pradesh snowfall : గత కొన్ని రోజులుగా ఉత్తర భారతదేశంలోని పర్వత ప్రాంతాల్లో భారీ హిమపాతం కొనసాగుతోంది. హిమాచల్ ప్రదేశ్ నుంచి ఉత్తరాఖండ్ వరకు విస్తరించిన కొండ ప్రాంతాలు మొత్తం తెల్లటి మంచు దుప్పటితో కప్పబడి ఉన్నాయి. ఈ తీవ్ర హిమపాతం కారణంగా 1200కు పైగా రోడ్లను తాత్కాలికంగా మూసివేసినట్లు అధికారులు తెలిపారు.

మంచు అందాలను వీక్షించేందుకు పర్యాటకులు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నప్పటికీ, పరిస్థితులు మాత్రం తీవ్రంగా మారాయి. ఉత్తరాఖండ్‌లోని ఔలి, బద్రీనాథ్, కేదార్‌నాథ్‌తో పాటు హిమాచల్ ప్రదేశ్, మనాలి, జమ్మూ కాశ్మీర్ ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో హిమపాతం నమోదైంది. విపరీతమైన చలితో ప్రజలు నిత్యజీవితంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Read Also: Vishwak Sen: ఫిబ్రవరి 13న ‘ఫంకీ’ మూవీ విడుదల

Himachal Pradesh snowfall

భారీ హిమపాతంతో పాటు వర్షాలు కూడా కురవడంతో రవాణా వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తమైంది. మంచు పేరుకుపోవడంతో వాహనాలు రోడ్లపై నిలిచిపోగా, కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడ్డాయి. గంటల తరబడి ప్రయాణికులు (Himachal Pradesh snowfall) మంచులోనే వేచి ఉండాల్సి వస్తోంది. విద్యుత్, నీటి సరఫరాకు కూడా అంతరాయం ఏర్పడుతోంది.

రాబోయే రోజుల్లో హిమపాతంతో పాటు వర్షాల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంటూ, ప్రజలు అత్యవసర ప్రయాణాలు మానుకుని అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

1200 roads closed Breaking News in Telugu Google News in Telugu heavy snowfall North India Himachal Pradesh snowfall Jammu Kashmir weather Latest News in Telugu Manali snow news snowfall traffic disruption Telugu News Uttarakhand snowfall winter weather India

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.