హిమాచల్ ప్రదేశ్ లో గతకొన్ని రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రం అతలాకుతలమయ్యింది. లోతట్టు ప్రాంతాలు వరదనీటిలో మునిగిపోయాయి. రోడ్లన్ని జలమయమైపోయాయి. మంగళవారం తెల్లవారుజామున నుంచి మండి జిల్లాలో కుండపోత వర్షం బీభత్సం సృష్టించింది. దీంతో జిల్లాలోని పలు ప్రాంతాలు వదలమైపోయాయి. వర్షాలకు వాహనాలు నీటిలో మునిగిపోయిన దృశ్యాలను స్థానికులు వీడియోలు తీసి, సోషల్ మీడియా లో పోస్టు చేసారు. దీంతో ఆ వీడియోలు వైరల్గా మారాయి.
వరదల కారణంగా ముగ్గురు మృతి
కాగా మండి (Mandi) లో ఉదయం నుంచి కురుస్తున్న కుంభవృష్టికి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ వరదల (Floods) కారణంగా ముగ్గురు మరణించారు. అంతేకాక భారీగా ఆస్తి నష్టం వాటిల్లిందని ఇక్కడి అధికారులు చెప్పారు. మండిజిల్లా కేంద్రంలోని జైల్రోడ్, జోనల్ హాస్పిటల్ రోడ్, సైంజ్ రీజియన్ తదితర ప్రాంతాల్లో వరదల (Floods) ప్రభావం ఎక్కువగా ఉందని తెలిపారు. వరద ప్రభావిత పాంతాల్లో ఉన్నతాధికారులు, అదనపు కలెక్టర్, మండి డిప్యూటీ కమిషనర్ తదితరులు పర్యటిస్తూ, పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
వరదల్లో చిక్కుకున్న వారిని రక్షిస్తున్న రెస్క్యూటీం
కాగా మండి తదితర ప్రాంతాలోని గ్రామాల ప్రజలు వరదలో (Villagers in flood) చిక్కునిపోయారు. వీరిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు రెస్క్యూ సిబ్బంది శ్రమిస్తున్నట్లు అధికారులు తెలిపారు. బాధిత కుటుంబాలను ఆదుకోవడంలో, శిథిలాల తొలగింపటులో రెస్క్యూ సిబ్బంది 24 గంటలూ నిమగ్నమయ్యారని పేర్కొన్నారు. కాగా, వర్షాలకు పలుచోట్ల కొండచరియలు విరిగిపడడంతో పఠాన్కోట్, మండి జాతీయ రహదారి, కిరాత్పూర్, మనాలి నాలుగు లైన్ల రహదారి, చండీగఢ్-మనాలి హైవేలు మూతపడ్డాయి.
Read hindi news: hindi.vaartha.com
Read also: Rahul Gandhi: మనసున్న రాహుల్ గాంధీ.. 22 మంది చిన్నారుల బాధ్యత స్వీకారం