హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాలు వరద నీటితో మునిగి పోయాయి. ఈ నేపథ్యంలో కిన్నౌర్ జిల్లా కిర్ జిన్నౌల్లా (Kir Jinnullah) వద్ద ఓ బ్రిడ్జి పాక్షికంగా కొట్టుకుపోయింది. ఈ ప్రమాదంతో కైలాష్ యాత్రకు వెళ్తున్న 413 మంది భక్తులు ఆ మార్గంలో చిక్కుకుపోయారు.
ఐటీబీపీ సిబ్బంది అప్రమత్తం… జిప్‌లైన్‌తో రక్షణ
పరిస్థితిని గుర్తించిన ITBP (ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్) బృందాలు వెంటనే స్పందించాయి. సాధారణ మార్గాలు నశించడంతో, తాత్కాలికంగా జిప్‌లైన్ ఏర్పాటు చేసి ఒక్కొక్కరిని నదిని దాటిస్తూ రక్షించారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. భక్తులందరూ సురక్షితంగా బయటపడినట్టు అధికారులు తెలిపారు.
సహాయ చర్యల్లో ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు
ఈ భారీ సహాయక చర్యల్లో 14 ఎన్‌డీఆర్‌ఎఫ్ (National Disaster Response Force) బృందాలు పాల్గొన్నాయి. అయితే వరదల తీవ్రత వల్ల ట్రెక్కింగ్ మార్గాలు పూర్తిగా ధ్వంసం కావడం సహాయక చర్యలకు ప్రధాన అడ్డంకిగా మారింది. అయినా సిబ్బంది నిరంతరం యత్నిస్తూ ప్రజల ప్రాణాలను రక్షించేందుకు శ్రమిస్తున్నారు.
హరిద్వార్‌లో గంగా ఉప్పొంగుతోంది… హెచ్చరికలు జారీ
ఇదిలా ఉండగా, ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల గంగానది ఉప్పొంగిప్రవహిస్తోంది. వాతావరణ శాఖ ఈ విషయంపై హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు ఘాట్‌లకు దూరంగా ఉండాలని, అవసరమైన జాగ్రత్తలు పాటించాలని స్థానిక అధికారులు కోరుతున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Read also: