📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Himachal Pradesh Floods: హిమాచల్‌లో వరద బీభత్సం: భారీగానే ప్రాణ, ఆస్తి నష్టం !

Author Icon By Shobha Rani
Updated: July 4, 2025 • 4:03 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు, వరదలు హిమాచల్ ప్రదేశ్‌ను (Himachal Pradesh Floods) ముంచెత్తుతున్నాయి. ఈ ప్రకృతి బీభత్సంలో ఇప్పటివరకు 37 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. రాష్ట్రవ్యాప్తంగా రూ.400 కోట్లకు పైగా ఆస్తి నష్టం వాటిల్లినట్టు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర విపత్తు (Himachal Pradesh Floods) నిర్వహణ అథారిటీ ప్రాథమికంగా అంచనా వేసింది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మండి జిల్లా – అత్యంత తీవ్రంగా ప్రభావితమైన ప్రాంతం
ఈ విపత్తులో మండి జిల్లా అత్యంత తీవ్రంగా ప్రభావితమైంది. ముఖ్యంగా తునాగ్ సబ్-డివిజన్‌లో రోడ్లు కొట్టుకుపోయి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. విద్యుత్, తాగునీటి సరఫరా వ్యవస్థలు దెబ్బతిన్నాయి. ఒక్క మండి జిల్లాలోనే సుమారు 40 మంది గల్లంతైనట్లు సమాచారం. అక్కడి ఒక గ్రామం పూర్తిగా నాశనమైందని అధికారులు తెలిపారు. బాధితుల కోసం సహాయక శిబిరాలను ఏర్పాటు చేసి, భారత వైమానిక దళం హెలికాప్టర్ల (Helicopters)ద్వారా ఆహార ప్యాకెట్లను జారవిడుస్తున్నారు.

హిమాచల్‌లో వరద బీభత్సం: భారీగానే ప్రాణ, ఆస్తి నష్టం !

250 రహదారులు మూసివేత, విద్యుత్, తాగునీటి వ్యవస్థలు
(Himachal Pradesh Floods) రాష్ట్రవ్యాప్తంగా 250కి పైగా రోడ్లు మూసుకుపోగా, 500కు పైగా విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు, సుమారు 700 తాగునీటి పథకాలు దెబ్బతిన్నాయి. మరోవైపు, సిమ్లా(Shimla)లోనూ వర్షాల కారణంగా తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. “భారీగా వర్షం కురుస్తోంది. మా తరగతి గదుల్లోకి నీళ్లు వస్తున్నాయి. బట్టలు, పుస్తకాలు తడిసిపోతున్నాయి. ఇళ్ల దగ్గరే ఉండమని మా టీచర్లు చెబుతున్నారు. పాఠశాల చుట్టూ ఉన్న చెట్లు ఎప్పుడు కూలిపోతాయోనని భయంగా ఉంది” అని సిమ్లాకు చెందిన తనుజా ఠాకూర్ అనే విద్యార్థిని తన ఆవేదనను వ్యక్తం చేసింది.

కేంద్ర-రాష్ట్ర బలగాలు సమన్వయంతో..

రాష్ట్ర, కేంద్ర బలగాలు (ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్), పోలీసులు, హోంగార్డులు సమన్వయంతో సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. 7వ తేదీ వరకు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండి) హెచ్చరించడంతో అధికారులు అప్రమత్తంగా ఉన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also: USA: చికాగోలో కలకలం సృష్టిస్తున్న కాల్పులు.. నలుగురు మృతి!

Breaking News in Telugu flood deaths Himachal Google news Google News in Telugu Himachal flood news Himachal Pradesh disaster Himachal Pradesh floods Himachal rains 2024 Himachal weather alert Indian Air Force rescue Himachal Latest News in Telugu Mandi flood news NDRF SDRF Himachal rescue Paper Telugu News Shimla school flood Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.