శుక్రవారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అకస్మాత్తుగా సంభవించిన క్లౌడ్‌బరస్ట్ (కుండపోత వర్షం) కారణంగా మలానా నది ఉగ్రరూపం దాల్చింది. ఈ వరద ధాటికి మలానా-I హైడ్రోపవర్ ప్రాజెక్టు(Hidropower Project) కు చెందిన కాఫర్‌డ్యామ్ పూర్తిగా కుప్పకూలిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
స్థానిక నివేదికల ప్రకారం, ఈ జలప్రళయంలో మలానా బ్యారేజ్(Malana Barage) పూర్తిగా ధ్వంసమైంది. ఓ స్థానికుడు చిత్రీకరించిన వీడియోలో, డ్యామ్ శిథిలావస్థకు చేరిన దృశ్యాలు, లోయ అంతటా చెల్లాచెదురుగా పడి ఉన్న భారీ శిథిలాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆకస్మిక వరద ఉధృతికి కార్లు, వంతెనలు, ఇళ్లు కాగితపు పడవల్లా కొట్టుకుపోయాయి.
వరదల్లో చిక్కుకుపోయిన 30 మంది
ఈ విపత్తు కారణంగా సుమారు 30 మంది వరదల్లో చిక్కుకుపోయినట్లు అధికారులు తెలిపారు. వీరిలో నలుగురైదుగురు కార్మికులు హైడ్రోపవర్ ప్రాజెక్టుకు చెందిన ఓ సొరంగంలో చిక్కుకున్నట్లు సమాచారం. మరో 20-25 మంది వరద ప్రభావిత ప్రాంతంలో బాహ్య ప్రపంచంతో సంబంధాలు కోల్పోయారు. నిరాశ్రయులైన వీరంతా పాడుబడిన భవనాల్లో తలదాచుకుంటున్నారని, వారికి ఆహారం, మంచి నీరు అందుబాటులో లేవని తెలిసింది.
పోలీసులు, సహాయక బృందాలు రంగంలోకి
సమాచారం అందుకున్న వెంటనే జాతీయ విపత్తు స్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్), పోలీసులు, స్థానిక సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. వరదల కారణంగా రహదారులు పూర్తిగా కొట్టుకుపోవడంతో సహాయక సిబ్బంది దట్టమైన అటవీ ప్రాంతాల గుండా నడుచుకుంటూ ఘటనా స్థలానికి చేరుకుంటున్నారు. పరిస్థితిని సమీక్షించేందుకు ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు ఉన్నతస్థాయి అత్యవసర సమావేశం నిర్వహించారు. కులులో ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం అధికారికంగా నమోదు కాలేదని, అయితే పలువురు గల్లంతయ్యారని అధికారులు తెలిపారు. నష్టం పూర్తిస్థాయిలో అంచనా వేయడానికి సమయం పడుతుందని అన్నారు. మరోవైపు, భారీ వర్షాలు కొనసాగుతున్నందున, మరిన్ని కొండచరియలు విరిగిపడే లేదా ఆకస్మిక వరదలు సంభవించే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు .
వరదకు ఉత్తమ నిర్వచనం ఏమిటి?
వరద: సాధారణంగా ఎండిన భూమిపైకి నీరు పొంగి ప్రవహించడం. నది, వాగు లేదా డ్రైనేజీ గుంట వంటి ఇప్పటికే ఉన్న జలమార్గంలో నీరు పెరగడం వల్ల సాధారణంగా ఎండిన ప్రాంతం ముంపునకు గురవుతుంది. వర్షం పడిన ప్రదేశంలో లేదా సమీపంలో నీరు నిలిచిపోవడం.
ఐదు రకాల వరదలు ఏమిటి?
ఐదు ప్రధాన రకాల వరదలు నది (లేదా నదీ) వరదలు, తీరప్రాంత వరదలు, ఆకస్మిక వరదలు, పట్టణ వరదలు మరియు లోతట్టు వరదలు (దీనిని పట్టణ వరద రకంగా కూడా పరిగణించవచ్చు.
Read hindi news: hindi.vaartha.com
Read also