జాతీయ రహదారుల (High Way) పై టోల్ చెల్లింపుల వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం కీలకమైన, కఠినమైన నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చింది. టోల్ ఫీ పెండింగ్ ఉన్న వాహనాలకు ఇకపై వెహికల్ ఓనర్‌షిప్‌కు అవసరమైన NOC, ఫిట్‌నెస్ సర్టిఫికెట్ రెన్యూవల్, నేషనల్ పర్మిట్ లభించదని స్పష్టం చేసింది. చాలా సందర్భాల్లో వాహనదారులకు తెలియకుండానే బకాయిలు ఏర్పడే అవకాశముంది. టోల్‌ప్లాజా వద్ద టెక్నికల్ సమస్యల వల్ల మనీ కట్ అవ్వకపోవడం కూడా టోల్ ఫీ పెండింగ్‌గా చూపించే అవకాశముంది.
Read Also: Rail One App: రైల్వే ప్రయాణికులకు బంపర్ ఆఫర్.. 6% వరకు డిస్కౌంట్!
పారదర్శకతను పెంచడం దీని ముఖ్య ఉద్దేశం
ఈ మార్పులు దేశవ్యాప్తంగా రహదారి రవాణా వ్యవస్థలో ఒక పెద్ద ముందడుగని కేంద్రం భావిస్తోంది. డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడం మాత్రమే కాక టోల్ వసూళ్లలో పారదర్శకతను పెంచడం దీని ముఖ్య ఉద్దేశమని అధికారులు అంటున్నారు.
ఈ కొత్త విధానం వల్ల, జాతీయ రహదారుల అభివృద్ధికి, నిర్వహణకు అవసరమైన నిధులు సమకూరుతాయని, తద్వారా రహదారుల నాణ్యత మెరుగుపడుతుందని భావిస్తున్నారు. టోల్ చెల్లించని వారిపై కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా, అందరూ నిబంధనలను పాటించేలా చేయడమే ప్రభుత్వ లక్ష్యం అని అంటున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: