రాజద్రోహం కేసులో శిక్ష అనుభవిస్తున్న ఓ యువకుడికి హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు (Himachal Pradesh High court) షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. భారత్- పాకిస్థాన్ యుద్ధ సమయంలో పాక్ జాతీయుడితో మాట్లాడుతూ అభ్యంతకర వ్యాఖ్యలు చేయడంతో అతడిపై రాజద్రోహం కేసు నమోదైంది. రెండు దేశాల మధ్య శాంతిని కోరుకోవడం రాజద్రోహం కిందకు రాదని తీర్పు సమయంలో హైకోర్టు వ్యాఖ్యానించింది. “భారత్- పాక్ యుద్ధంపై విమర్శలు చేస్తూ ఒకరితో మాట్లాడుతున్న ఫొటోలు, వీడియోలతో కూడిన పెన్ డ్రైవ్‌ను ప్రాథమిక సాక్యాలుగా అందించారు. మతంతో సంబంధం లేకుండా ప్రజలందరూ కలిసి ఉండాలని, యుద్ధాలతో ఎలాంటి ఉపయోగం లేదని వారు అన్నారు. ఇరు దేశాల మధ్య శత్రుత్వాలను అంతం చేసి, శాంతిని పునరుద్ధరించాలనే కోరిక దేశద్రోహం ఎలా అవుతుందో అర్థం చేసుకోవడం కష్టం. అతడి పోస్ట్ అశాంతి వాతావరణాన్ని సృష్టించలేదు. అందువల్ల వాటిని దేశద్రోహంగా పరిగణించలేము.” అని జస్టిస్ రాకేష్ కైంత్లా అన్నారు.
Read Also: Kerala: ప్రేయసిని కారుతో గుద్దించి.. తల్లిదండ్రులను మెప్పించాడు..చివర్లో ఊహించని ట్విస్ట్
షరతులతో బెయిల్ మంజూరు
రాజద్రోహంగా పరిగణించని హైకోర్టు, షరతులతో కూడి బెయిల్ మంజూరు చేసింది. పాస్‌పోర్ట్ అప్పగించడం సహా ఐదు షరతులతో బెయిల్ మంజూరు చేసింది. ముఖ్యంగా సాక్ష్యులను, సాక్ష్యాలను ప్రభావితం చేయకూడదని స్పష్టం చేసింది. దీంతో పాటు రూ. 50,000 వ్యక్తిగత పూచీకత్తును సమర్పించాలని ఆదేశించింది. ఏదైనా ఉల్లంఘన జరిగితే ట్రయల్ కోర్టు తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చని స్పష్టం చేసింది. నిబంధనలు పాటించని క్రమంలో బెయిల్‌ను రద్దు చేయాలని పిటిషన్ దాఖలు చేసేందుకు స్వేచ్ఛ ఉంటుందని హైకోర్టు పేర్కొంది.
2024 జూన్‌లో పాకిస్థాన్ జెండాలతో పాటు ఏకే 47 లాంటి ఆయుధాలతో కూడిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు ఓ యువకుడు. దీనిపై 2025 మే 28న భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 152 ప్రకారం కేసు నమోదైంది. ఈ కేసు సున్నితత్వం నేపథ్యంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు కూడా సమాతంరంగా దీనిపై విచారణ చేపట్టాయి. కేసు సున్నితత్వాన్ని పరిగణనలోకి తీసుకుని, జాతీయ దర్యాప్తు సంస్థలు కూడా ఈ కేసులో సమాంతర దర్యాప్తును నిర్వహించాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: