ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, మహారాష్ట్ర, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌ల మధ్యనున్న విస్తృత దండకారణ్య ప్రాంతాల్లో “ఆపరేషన్ కగార్” (Operation Kagar) పేరుతో భద్రతా బలగాలు విస్తృతంగా కూబింగ్, విచారణలు కొనసాగిస్తున్న వేళ మావోయిస్టు అగ్రనేత హిడ్మా (Hidma) తాజా ఫోటో బయటపడటం సంచలనంగా మారింది. ఇప్పటివరకు గుట్టుగా ఉన్న హిడ్మా గుర్తింపు వివరాల్లో ఈ తాజా ఫోటో కొత్త మలుపు తేవొచ్చని భావిస్తున్నారు.
హిడ్మా – మావోయిస్టు వ్యూహకర్త
హిడ్మా పూర్తి పేరు మదవి హిడ్మా. ఛత్తీస్ గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా పువర్తి గ్రామానికి చెందిన ఈ మావోయిస్టు నేత ప్రస్తుతం సెంట్రల్ కమిటీ సభ్యుడిగా ఉన్న హిడ్మా దండకారణ్యంలో పార్టీ శ్రేణులను ముందుండి నడిపిస్తారని సమాచారం.
గతంలో హిడ్మా అరెస్ట్ అయినట్టుగా ప్రచారం
మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఉన్న హిడ్మాను పట్టుకునేందుకు బలగాలు అడవులను జల్లెడపడుతున్నాయి. వేలాది బలగాలు దండకారణ్యంలో కూబింగ్ నిర్వహిస్తున్నాయి. ఇటీవల హిడ్మాను పోలీసులు అరెస్ట్ చేశారంటూ ప్రచారం జరిగింది. అరెస్టు వార్త నిజమే అయినా పోలీసులకు దొరికింది హిడ్మా కాదని, ఆయన పేరున్న మరో మావోయిస్టు కుంజం హిడ్మా అని పోలీసులు తర్వాత వివరణ ఇచ్చారు. కుంజం హిడ్మా ఏరియా కమిటీ సభ్యుడు అని చెప్పారు.
తాజా ఫోటో ఎలా లీకైంది?
ఇప్పటి వరకు హిడ్మాకు సంబంధించిన ఫొటోలు పెద్దగా అందుబాటులో లేవు. 20 ఏళ్ల నాటి ఫొటో ఒకటి పోలీసుల వద్ద ఉంది. హిడ్మా వయసు ప్రస్తుతం 51 ఏళ్లు. తాజాగా హిడ్మా లేటెస్ట్ ఫొటో బయటకు వచ్చింది. దీంతో హిడ్మా ఎక్కడ ఉన్నారు. ఆయన ఫోటో ఎలా బయటకు వచ్చింది అనే చర్చ మొదలైంది.
Read also: Eknath Shinde: ఏక్‌నాథ్ షిండేకు విమానాశ్రయంలో ఊహించని అనుభవం
Tejashwi Yadav: తేజస్వి యాదవ్‌కు త్రుటిలో తప్పిన పెను ప్రమాదం