📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Heavy rians : రాజస్థాన్‌లో కుండపోత వర్షాలు.. 12 మంది మృతి !

Author Icon By Sudha
Updated: July 15, 2025 • 4:13 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఉత్తరాది రాష్ట్రం రాజస్థాన్‌ (Rajasthan) ను కుండపోత వర్షాలు (Heavy rains) ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. కోటా సహా పలు జిల్లాల్లో ఎడతెరపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. కోటా, పాలి, జాలోర్ ధోల్పూర్‌ జిల్లాలో ఈ వర్షాలు తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వర్షాలవల్ల చోటుచేసుకున్న వేర్వేరు ఘటనల్లో మొత్తం 12 మంది ప్రాణాలు కోల్పోయారు. లోతట్టు ప్రాంతాల్లో ట్రాక్‌లపై వరదనీరు నిలవడంవల్ల రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. జోధ్‌పూర్‌ జిల్లాలో కరెంట్ షాక్‌ తగిలి వేర్వేరు ఘటనల్లో ఒక రైతు, ఒక ఎలక్ట్రిసిటీ లైన్‌మాన్‌ ప్రాణాలు కోల్పోయారు. పాలీ జిల్లాలో భారీ వర్షాలవల్ల నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దాంతో మంగళవారం జిల్లాలోని పాఠశాలలకు సెలవు ప్రకటించారు.

Heavy rians : రాజస్థాన్‌లో కుండపోత వర్షాలు.. 12 మంది మృతి !

తెగిపోయాయిన రోడ్లు

జాలోర్‌, జోధ్‌పూర్ జిల్లాల్లో ట్రాక్‌లపై వరదనీరు నిలువడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పలు రైళ్ల వేళల్లో మార్పులు చేశారు. కోటా జిల్లాలో చంబల్‌ రివర్‌ ఉప్పొంగి లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. చంబల్‌ నదిలో చేపల వేటకు వెళ్లిన ఏడుగురు జాలర్లు ప్రవాహంలో కొట్టుకుపోయారు. రాన్‌పూర్‌లో స్కూటీపై వెళ్తున్న ఓ విద్యార్థిని రోడ్డుపైకి వచ్చిన వరదలో జారిపడి కొంతదూరం కొట్టుకుపోయింది. ఎస్డీఆర్‌ఎఫ్‌ బలగాలు ఆమెను బయటికి తీసుకొచ్చినప్పటికీ ప్రాణాలు కాపాడలేకపోయారు. ధోల్‌పూర్‌ జిల్లాలోని నారిపుర, సంత్‌నగర్‌ ఏరియాల్లో వరద ప్రవాహానికి రోడ్లు తెగిపోయాయి. ఇద్దరు బైకర్‌లు ప్రవాహంలో కొట్టుకుపోయారు.

రాజస్థాన్ లో వర్షాకాలం ఎలా ఉంటుంది?

రాజస్థాన్‌లో వేడి మరియు తడి వాతావరణం, వర్షాకాలం జూలై నుండి సెప్టెంబర్ వరకు ఉంటుంది. ఈ కాలంలో, తేమ రేటు ఎక్కువగా ఉంటుంది మరియు ఉష్ణోగ్రత కూడా ఎక్కువగా ఉంటుంది, తరచుగా పగటిపూట 30°C (86°F) కంటే ఎక్కువగా ఉంటుంది, కానీ వర్షపాతం మితంగా ఉంటుంది.

రాజస్థాన్ లో అతి శీతల నెల ఏది?

రాజస్థాన్‌లో జనవరి అత్యంత చలిగా ఉండే నెల, ముఖ్యంగా ఎడారి మరియు ఉత్తర ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతాయి. చురు మరియు మౌంట్ అబూ వంటి నగరాల్లో 0°C వరకు ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయి, కొన్ని ప్రాంతాలలో చలికాలంలో మంచు కురుస్తుంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Projects: పెండింగ్ ప్రాజెక్టులకు త్వరగా అనుమతులివ్వండి

Breaking News flood deaths Heavy Rains Indian weather latest news monsoon rains Rajasthan Rajasthan floods Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.