పాఠాలు చెప్పే ఉపాధ్యాయుల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. విద్యార్థుల జీవితాలకు బంగారు బాటలు వేసేందుకు అహర్నిశలు శ్రమిస్తుంటారు టీచర్లు. వారెంత క్రమశిక్షణతో ప్రవర్తిస్తారో విద్యార్థులు కూడా ఉపాధ్యాయుల అడుగుజాడల్లో నడుస్తారు. కానీ దారితప్పే టీచర్లు లేకపోలేదు. ఆమధ్య స్కూలు ఫుల్గా తాగొచ్చిన టీచర్ తనపై విచారణ చేసేందుకు వచ్చిన అధికారులపై చిందులేసాడు. తాజాగా మరో ఉపాధ్యాయుడు విద్యాధికారిపై బెల్ట్ల చితకబాదాడు. ఈ దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
మహిళా టీచర్ ఫిర్యాదుతో విచారణ
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మహ్మదాబాద్ లోని నద్వా ప్రాథమిక పాఠశాలలో బిజేంద్ర కుమార్ వర్మ హెడ్ మాస్టర్ గా పనిచేస్తున్నారు. అయితే, ఈయన తనను వేధిస్తున్నాడంటూ అదే స్కూల్లో పనిచేస్తున్న అసిస్టెంట్ టీచర్(Assistant Teacher) ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై విచారణకు రమ్మంటూ బిజేంద్ర కుమార్ వర్మకు విద్యాధికారి అఖిలేశ్ ప్రతాప్సింగ్ నోటీసులు జారీ చేశారు. వేధింపుల ఘటనపై విచారిస్తున్న క్రమంలో బిజేంద్ర కుమార్ వర్మ రెచ్చిపోయారు.
బెల్ట్ అధికారిపై దాడి
అధికారులు తననే ప్రశ్నిస్తారా అంటూ హెడ్ మాస్టర్ బిజేంద్ర కుమార్ వర్మకు కోపం కట్టలు తెంచుకుంది. దీంతో తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతూ తన బెల్ట్ తీసి అఖిలేష్ ప్రతాప్సింగ్ పై దాడి చేశాడు. అక్కడే ఉన్న సిబ్బంది బిజేంద్రను బలవంతంగా గదిలో నుంచి బయటకు తీసుకెళ్లారు. ఈ ఘటనపై స్పందించిన విద్యాశాఖ హెడ్మాస్టర్ బిజేంద్రను సస్పెండ్(suspend) చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. విద్యాధికారి అఖిలేష్ ఫిర్యాదు మేర పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
దాడికి కారణం ఏమిటి?
హెడ్ మాస్టర్ బిజేంద్ర కుమార్ వర్మపై ఉన్నతాధికారులు విచారణ కోసం రాకమన్న కారణంతో కోపంతో బెల్ట్ తో దాడి చేశారు.
హెడ్ మాస్టర్‌పై ప్రభుత్వం ఏ చర్య తీసుకుంది?
బిజేంద్ర కుమార్ వర్మను సస్పెండ్ చేసి, సంబంధిత విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
Read hindi news: hindi.vaartha.com
Read Also: