లండన్ ల్యూటన్ విమానాశ్రయం నుంచి గ్లాస్గోకు వెళ్తున్న ఈజీజెట్ విమానం (EasyJet flight heading to Glasgow) లో అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. ప్రయాణం మధ్యలో 41 ఏళ్ల ఓ వ్యక్తి ఆకస్మికంగా లేచి అరవడం ప్రారంభించాడు. అతను విమానంలో బాంబు పెట్టబోతున్నానని కేకలు వేసి అందరినీ భయబ్రాంతులకు గురి చేశాడు.అతడు “డెత్ టూ అమెరికా”, “డెత్ టూ ట్రంప్” అంటూ నినాదాలు చేశాడు. అంతేకాకుండా “అల్లా హో అక్బర్” (“Allahu Akbar”) అని గట్టిగా అరిచాడు. ఈ సంఘటనతో ప్రయాణికులు క్షణాల్లో భయాందోళనకు గురయ్యారు. సిబ్బంది పరిస్థితిని అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నించారు.
ధైర్యంగా స్పందించిన మరో ప్రయాణికుడు
ఆ సమయంలో ఉన్న మరో ప్రయాణికుడు ధైర్యంగా ముందుకు వచ్చాడు. అతడిని నేలకూల్చి అదుపులోకి తీసుకున్నాడు. దీంతో పరిస్థితి మరింత తీవ్రం కావడం తప్పింది. విమానం సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకుంది.గమ్యస్థానానికి చేరుకున్న వెంటనే గ్లాస్గో పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతని వెనుక ఇంకెవరైనా ఉన్నారేమోనని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కౌంటర్ టెర్రరిజం అధికారులు కూడా ఈ కేసులో విచారణ ప్రారంభించారు.
సోషల్ మీడియాలో వీడియో వైరల్
ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రయాణికులు ఎదుర్కొన్న భయం ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది.ఘటన సమయంలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్కాట్లాండ్ పర్యటనలో ఉన్నారు. ఈయూతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునేందుకు ఆయన రెండు రోజుల క్రితమే అక్కడికి వచ్చారు. ఈ పరిస్థితుల్లో ఈ సంఘటన చోటుచేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.ఈ అనూహ్య సంఘటన విమాన ప్రయాణ భద్రతపై మరోసారి చర్చలకు దారితీస్తోంది. విమానాశ్రయాలు, ఎయిర్‌లైన్స్ భద్రతా చర్యలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.
Read Also : Loksabha : లోక్ సభలో నేడు ఆపరేషన్ సిందూర్ ప్రత్యేక చర్చ