దేశంలోని ప్రముఖ ప్రైవేట్ బ్యాంకులలో ఒకటైన (HDFC) బ్యాంకు రుణగ్రాహులకు ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్-బేస్డ్ లెండింగ్ రేటు (MCLR)ను 10 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త రేట్లు నవంబర్ 7 నుంచి అమల్లోకి వచ్చినట్లు బ్యాంకు (HDFC) వెల్లడించింది. ఈ నిర్ణయంతో వ్యక్తిగత రుణాలు, హౌసింగ్ లోన్స్, వాహన రుణాలు, కార్పొరేట్ లోన్స్ వంటి వివిధ రకాల రుణాలపై వడ్డీ భారాలు కొంతవరకు తగ్గనున్నాయి.
Read Also: Android Users: ఆండ్రాయిడ్ ఓల్డ్ వెర్షన్ యూజర్లకు అలెర్ట్
(MCLR)ను 10 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది
ఇప్పటివరకు MCLR 8.45% నుంచి 8.65% మధ్య ఉండేది. అయితే, తాజా తగ్గింపుతో అది 8.35% నుంచి 8.60% మధ్యకు చేరింది. అంటే, 10 బేసిస్ పాయింట్ల (0.10%) తగ్గింపుతో రుణగ్రాహులకు కొంత ఊరట లభించనుంది. బ్యాంకు ఒకరోజు, నెల, 3 నెలలు, 6 నెలలు, ఏడాది, మూడు సంవత్సరాల కాలపరిమితి కలిగిన రుణాలపై కొత్త రేట్లను ప్రకటించింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: