📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

HDFC Bank: మూడో త్రైమాసికంలో పెరిగిన బ్యాంక్ నికర లాభాలు

Author Icon By Saritha
Updated: January 17, 2026 • 5:25 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్ అయిన (HDFC Bank) హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (FY26) మూడో త్రైమాసికంలో బలమైన పనితీరు కనబరిచింది. డిసెంబర్‌తో ముగిసిన ఈ త్రైమాసికంలో బ్యాంక్ (Bank) ఏకీకృత నికర లాభం వార్షిక ప్రాతిపదికన 12.17 శాతం పెరిగి రూ.19,806.63 కోట్లకు చేరినట్లు శనివారం ప్రకటించింది. గతేడాది ఇదే కాలంలో బ్యాంక్ లాభం రూ.17,656.61 కోట్లుగా ఉంది.

Read also: Free Bus: పురుషులకూ బస్సుల్లో ఉచిత ప్రయాణం.. ఎక్కడంటే?

ఆస్తుల నాణ్యత మెరుగు

(HDFC Bank) బ్యాంక్ కీలక ఆదాయమైన నికర వడ్డీ ఆదాయం(NII) కూడా 6.4 శాతం పెరిగి రూ.32,615 కోట్లకు చేరుకుంది. ఆస్తుల నాణ్యత విషయంలో బ్యాంక్ పనితీరు మెరుగుపడింది. స్థూల నిరర్థక ఆస్తుల (గ్రాస్ NPAలు) నిష్పత్తి గత ఏడాదితో పోలిస్తే 1.42 శాతం నుంచి 1.24 శాతానికి తగ్గింది. నికర NPAల నిష్పత్తి కూడా 0.46 శాతం నుంచి 0.42 శాతానికి మెరుగుపడింది.

ఈ త్రైమాసికంలో కేటాయింపులు (ప్రొవిజన్స్) 10 శాతం తగ్గి రూ.2,837.9 కోట్లకు పరిమితం కావడం లాభాల పెరుగుదలకు దోహదపడింది. 2025 డిసెంబర్ 31 నాటికి బ్యాంక్ మొత్తం డిపాజిట్లు 12.2 శాతం వృద్ధితో రూ.27,524 బిలియన్లకు, ఇచ్చిన రుణాలు (అడ్వాన్సులు) 11.9 శాతం వృద్ధితో రూ.28,446 బిలియన్లకు చేరాయని బ్యాంక్ తన ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో వెల్లడించింది. మొత్తం మీద ఆదాయం, లాభాలతో పాటు కీలక వ్యాపార కార్యకలాపాల్లోనూ బ్యాంక్ స్థిరమైన వృద్ధిని నమోదు చేసింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:



గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.