📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Latest Telugu news : Hardeep Singh Puri – ఈ20 ఇంధనం సురక్షితం..కేంద్రమంత్రి

Author Icon By Sudha
Updated: September 17, 2025 • 3:09 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇరవై శాతం ఇథనాల్‌ కలిపిన పెట్రోల్‌ సురక్షితం కాదని గత కొన్ని రోజులుగా సోషల్‌ మీడియాలో చర్చ జరుగుతున్నది. బయో ఇంధనాలవల్ల ఆటోమొబైల్ ఇంజిన్‌లు దెబ్బతింటాయని పలువురు ప్రచారం చేస్తున్నారు. అయితే ఈ ప్రచారాలను కేంద్ర మంత్రి హర్దీప్‌సింగ్‌ పురి (Hardeep Singh Puri) కొట్టిపారేశారు. పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్‌ కలపడంవల్ల వాహనాల మైలేజీ తగ్గుతోందనేది చెత్త వాదన అన్నారు. ఈ20 (E20) ఇంధనం పర్యావరణపరంగా ఉపయోగించడానికి సురక్షితమని కేంద్ర మంత్రి హర్దీప్‌సింగ్‌ పురి (Hardeep Singh Puri) చెప్పారు. అయితే దీర్ఘకాలంలో పాత వాహనాల్లో గ్యాస్కెట్స్‌, ఇంధన రబ్బర్‌ ట్యూబ్స్‌, పైపులను మార్చాల్సి రావచ్చని, అది పెద్ద సమస్యేమీ కాదని, సాధారణమైన విషయమేనని పేర్కొన్నారు. పలువురు ఉద్దేశపూర్వకంగానే ఇథనాల్‌తో సమస్యలు వచ్చే అవకాశం ఉందని ప్రజల్లో తప్పుడు భయాలను సృష్టిస్తున్నారని తెలిపారు. అంతర్జాతీయ ఇంధన సంస్థ అంచనాల ప్రకారం.. రాబోయే రెండు దశాబ్దాల్లో భారత్‌లో ఇంధన డిమాండ్ ప్రపంచ దేశాల్లో ఉన్న దానికంటే మూడు రెట్లు పెరుగుతుందన్నారు.

Hardeep Singh Puri – ఈ20 ఇంధనం సురక్షితం..కేంద్రమంత్రి

అలాంటి సమయంలో ఇథనాల్‌ ప్రధాన ఇంధన వనరుగా మారే అవకాశం ఉందని హర్దీప్‌ సింగ్‌ పురి (Hardeep Singh Puri)అన్నారు. పెట్రోల్‌తో పోలిస్తే ఇథనాల్ ఎనర్జీ డెన్సిటీ కొంతమేర తక్కువ ఉండడంతో మైలేజీలో తగ్గుదల ఉన్నప్పటికీ, అది అతి స్వల్పమేనని ఆ శాఖ వెల్లడించింది. కాగా ఈ20 ఇంధనం పాత వాహనాల సామర్థ్యాన్ని దెబ్బతీస్తుందేమో..? డ్రైవింగ్‌ను దెబ్బతీస్తుందేమో..? అని వాహనదారులు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. ఇథనాల్‌ను కలిపిన పెట్రోల్‌ను వినియోగించడంవల్ల మైలేజీ సమస్యలు వస్తాయనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వశాఖ ఇప్పటికే వివరణాత్మక స్పష్టత ఇచ్చింది. ఇథనాల్ కలిసిన పెట్రోల్‌తో ఎలాంటి ఇంజిన్‌ సమస్యలు తలెత్తవని వెల్లడించింది. ఇథనాల్‌ వల్ల కర్బన ఉద్గారాలు తగ్గుతాయని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుందని వ్యాఖ్యానించింది. కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ సైతం పలుమార్లు ఈ విషయంపై స్పష్టతనిచ్చారు.

హర్దీప్ సింగ్ పూరి ఐఏఎస్ అధికారి?

ఆయన 1974 బ్యాచ్ ఇండియన్ ఫారిన్ సర్వీస్ అధికారి, 2009 నుండి 2013 వరకు ఐక్యరాజ్యసమితికి భారతదేశ శాశ్వత ప్రతినిధిగా పనిచేశారు.

హర్దీప్ సింగ్ పూరి ప్రస్తుత హోదా ఏమిటి?

హర్దీప్ సింగ్ పూరి (జననం 15 ఫిబ్రవరి 1952) ఒక భారతీయ రాజకీయ నాయకుడు మరియు భారత విదేశాంగ సేవలో పదవీ విరమణ చేసిన దౌత్యవేత్త, అతను 2021 నుండి పెట్రోలియం మరియు సహజ వాయువు శాఖకు 33వ మంత్రిగా పనిచేస్తున్నాడు.

ఎల్పిజి ఏ వాయువు కుటుంబానికి చెందినది?

ద్రవీకృత పెట్రోలియం వాయువు రంగులేని, సమర్థవంతమైన ఇంధనం. ఇది హైడ్రోజన్ మరియు కార్బన్ అణువులను మాత్రమే కలిగి ఉన్న అణువులతో తయారు చేయబడింది, ఇది హైడ్రోకార్బన్ కుటుంబంలో భాగం చేస్తుంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/singareni-gold-copper-exploration-license-karnataka/telangana/548962/

biofuel Breaking News E20 fuel fuel safety Green Energy Hardeep Singh Puri latest news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.