సిందూర్ చర్చ సమయంలో ఎంపీ బెనివాల్ (Hanuman Beniwal)జోకేశారు. భార్యగా మారిన పాకిస్థాన్ (Pakistan)ను.. ఇండియాకు తీసుకురావాలన్నారు. సిందూర్ అని పేరు ఎందుకు పెట్టినట్లు అని ఆయన ప్రశ్నించారు. తన ప్రసంగంలో సెటైర్లు వేస్తూ సభ్యులను ఆయన నవ్వించారు. సిందూర్ అని ఎందుకు పేరు పెట్టారో తెలియదు, కానీ, పాకిస్థాన్‌కు ఇండియా సిందూరం పెట్టినట్లుగా ఉందని, హిందువుల నమ్మకం ప్రకారం భారతీయ మహిళలు తన భర్తను సిందూరంగా భావిస్తారని, పాకిస్థాన్‌కు భారత్ సిందూరం పెట్టిందని, అందుకే ఇండియాకు పాకిస్థాన్ భార్యగా మారిందని, ఇప్పుడు కేవలం వధువు అప్పగింతలు మాత్రమే మిగిలి ఉన్నట్లు ఎంపీ బెనివాల్ (Hanuman Beniwal) పంచ్ వేశారు. వెళ్లి పాకిస్థాన్‌కు ఇంటికి తీసుకురావాలని ఆయన డైలాగ్ విసిరారు. దీంతో సభలో నవ్వులు పూశాయి.
ఆయన దగ్గర కూర్చున్న ఎంపీలు కూడా నవ్వును ఆపుకోలేకపోయారు. చాలా సీరియస్‌గా డిస్కషన్ జరుగుతున్న సమయంలో ఎంపీ బెనివాల్ (Hanuman Beniwal)వేసిన సెటైర్‌తో అన్ని పార్టీల సభ్యులు కాసేపు నవ్వుకున్నారు. ఓ దశలో తొందరగా ప్రసంగాన్ని ముగించుకోవాలని ఓ ఎంపీ అరవడంతో.. ఆయన వైపు చూస్తూ మీరు అరగంట మాట్లాడారు, నన్ను అప్పుడే ముగించేయమంటారా అని అన్నారు. అదే సమయంలో ప్యానల్ స్పీకర్ బజర్ బెల్ కొట్టడంతో మళ్లీ పంచ్ విసిరారు. అయిపోయిందా అంటూ వ్యంగ్యంగా రియాక్ట్ అయ్యారు. దీంతో మళ్లీ ఎంపీలు అందరూ నవ్వుకున్నారు. వాస్తవానికి రాత్రి పదిన్నర సమయంలో ఆయన మాట్లాడారు. కానీ ఇప్పుడు ఉదయం పదిన్నర అయ్యిందని, తన వ్యాఖ్యలు ఏవీ న్యూస్‌పేపర్లలో రావు అని, కేవలం సోషల్ మీడియాలో మాత్రమే మ్యానేజ్ చేసుకోవాల్సి వస్తుందని అన్నారు. దీంతో మరోసారి సభలో ఉన్న ఎంపీలు నవ్వుకున్నారు. సింధూర్ అని ఎందుకు పేరు పెట్టారో ప్రధాని చెప్పాలని ఆయన కోరారు. అగ్నివీర్ పథకంతో సైనికుల్లో మనోధైర్యం సన్నగిల్లిందన్నారు.
హనుమాన్ బేణివాల్ ఎక్కడి నుండి ఎంపీ?
ఆయన 2019 నుండి నాగౌర్ నుండి లోక్‌సభ ఎంపీగా పనిచేస్తున్నారు. ఆయన రాష్ట్రీయ లోక్‌తాంత్రిక్ పార్టీ అధ్యక్షుడు మరియు జాతీయ కన్వీనర్. ఆయన 2008 నుండి ఖిన్వ్‌సర్ నియోజకవర్గం నుండి నాలుగు సార్లు రాజస్థాన్ శాసనసభకు ఎన్నికయ్యారు.
హనుమాన్ బెణివాల్ రాజకీయ చరిత్ర?
రాజకీయ జీవితం తొలినాళ్లలోబెనివాల్ రాజస్థాన్ విశ్వవిద్యాలయంలో విద్యార్థి నాయకుడిగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 1994లో, బెనివాల్ జైపూర్‌లోని మహారాజా కళాశాల విద్యార్థి సంఘానికి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు, 1995లో ఆయన మళ్ళీ ఆ పదవిలో కొనసాగారు. 1996లో బెనివాల్ జైపూర్‌లోని లా కళాశాల అధ్యక్షుడయ్యారు.
హనుమాన్ బేనివాల్ మతం?
ఆయన హిందూ జాట్ సమాజానికి చెందినవారు. ఆయన 1993లో రాజస్థాన్ విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ పట్టా పొందారు మరియు 1998లో న్యాయశాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీ పొందారు. ఆయన తమ్ముడు నారాయణ్ బేణివాల్, నాగౌర్‌లోని ఖిన్వ్‌సర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న రాజస్థాన్ శాసనసభ మాజీ సభ్యుడు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: Politics : ఎమ్మెల్యేలతో సీఎం సిద్ధరామయ్య సమావేశంకు డీకే