📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Handloom : జీవకళ కోల్పోతున్న చేనేత!

Author Icon By Sudha
Updated: August 7, 2026 • 4:15 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Handloom : చేనేత భారతదేశపు సాంస్కృతిక సుసంపన్నమైన వారసత్వానికి ప్రతీక. వేల సంవత్సరాలుగా భారతీ యుల జీవన విధానంలో అంతర్భాగంగా బాసిల్లుతూ చేనేతకు ప్రత్యేక స్థానం ఉంది. దీనికి తోడు చేతితో నూలు వడకడం, చేనేత వస్త్ర ఉత్ప త్తులలో వృత్తి నైపుణ్యంలో చేనేత కార్మికుడు ఎవరికి తీసిపోడు. స్వా తంత్ర్య పోరాట ఉద్యమానికి స్ఫూర్తి నిచ్చిన రాట్నం నేడు రక్షణకు నోచు కోలేక విలవిలలాడుతుంది. విదేశీ వస్త్ర బహిష్కరణ ఆనాటి ఆంగ్లేయుల ప్రభుత్వాన్ని బెంబేలెత్తించింది. ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షలాదిమందికి అధిక సంఖ్యలో ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న చేనేత పరిశ్రమ సాటిలేని పనితనం, వారసత్వ అనుభవం గల ఈ ప్రాచీన పరిశ్రమకు మన దేశపు చేనేత వస్త్రాల నైపుణ్యం, కళాత్మకత ప్రపంచమంతటా మన్ననలు పొందాయి. ఒకప్పుడు ఎంతో గర్వంగా దేశానికే ప్రతిష్టతెచ్చే విధంగా మనగలిగిన చేనేతకు. చేనేత కార్మికులకు స్వాతంత్య్రనంతరం నుండి నేటివరకు వచ్చిన ప్రభుత్వాలు, పాలకులు చేనేత పరిశ్రమను రక్షిస్తామని, చేసేది గోరంత… చెప్పేది కొండంత అన్న చందాన గొప్పగానే చెబుతున్నా ఆచరణకు ఆమడ దూరంలో విధివిధానాలు రూపొందిస్తూ సరైన ప్రోత్సాహకం అందించక చేనేత కార్మికుల బతుకు లను భారంగా మారుస్తూ చేనేత పరిశ్రమను నేడు అంత రించే దశకు దిగజారుస్తున్నారు.

Read Also : Pedda Shankarampet: చేనేత కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలి.. వల్లకాటి రాజ్ కుమార్

Handloom

Handloom : ఎక్కడ వేసిన గొంగళి అక్కడే

తెలంగాణ రాష్ట్రంలోచేనేత వస్త్ర ఉత్పత్తులకు, ముచ్చట గొలిపే పనితనానికి, కళాత్మక తతో తయారైన వస్త్రాలకు ఆదరణ లభించడానికి అందం ఒకటే ప్రధానం కాదు, నేసిన వస్త్రంలోని ప్రతి అంగుళం యంత్ర సహాయం లేకుండా చేనేత క కాకారుడు చూపగల కళా నైపుణ్యానికి ప్రత్యక్ష నిదర్శనం. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో చేనేత కార్మికులు అప్పుల బారిన పడి ఆకలి చావులు, ఆత్మహత్యలతో నిండునూరేళ్ళు బతకాల్సిన నేత న్నలు ప్రభుత్వ చేనేత పథకాలు, విధివిధానాలు వికటించి, పేదరికంతో అనారోగ్యంతో రోగాల బారినపడి, తిండి దొరకక మృత్యులోగిళ్లలోకి వెళుతున్నారు. ప్రభుత్వాల ఉదాసీన వైఖరి నిర్లక్ష్యం వల్ల ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందాన బతకలేక పూటగడవక బతుకు పోరుబాట పట్టలేక యాచక వృత్తి ఆశించలేక, ప్రభుత్వాన్ని నిలదీసే శక్తి లేక, పని భద్రత లేక, కనీసం వేతనాలు అందక, సౌకర్యాలు కరువై, భవిష్యత్తుపై భరోసా లభించక చేనేత కార్మికులు నేసే మగ్గం దారమే ఉరితాడుగా నిండు ప్రాణాలను బలి తీసుకుంటూ ఆత్మహత్యలకు పాల్ప డుతున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కామారెడ్డి డిక్లరేషన్ ఎన్నికల మేనిఫెస్టోలో చేనేత రంగానికి అనేక హామీలు ఇచ్చి అధికారంలోనికి రాగానే చేనేత కార్మికుల సంక్షేమం కోసం అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకోకపోగా 45 మంది చేనేత కార్మికులు బలవన్మరణాలకు పాల్పడ్డారు.

మూలిగే నక్క మీద తాటికాయ పడ్డ చందాన

కాంగ్రెస్ ప్రభుత్వం చేనేత కార్మికులకు కొత్త పథకాలు అమలు చేయ కపోగా పాత పథకాలకి కోతలు విధిస్తూ నమ్మినచేనేతలను, చేనేత కార్మికులను నిట్ట నిలువునా మోసం చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదే. దశాబ్ద కాలంగా తెలంగాణ ప్రభుత్వం చేనేత సహకార సంఘాల వద్ద టెస్కో ద్వారా చేనేత వస్త్ర ఉత్పత్తులను చేనేత కార్మికులకు పని కల్పిం చాలనే ఉద్దేశంతో జీవో నెంబర్ 1 ద్వారా చేనేత సహకార సంఘాలలో ఉత్పత్తి అయిన వస్త్రాలను టెస్కో ద్వారా కొనుగోలు చేసి వాటిని గురుకుల పాఠశాలలకు షర్టింగ్, షూటింగు, దుప్పట్లు, తువాళ్లు, కార్పెట్లు, ప్రభుత్వ ఆను పత్రులు, కారాగారాలు, హాస్టళ్లకు సప్లైజరిగేది. అలా ఇప్పటి వరకు కొనసాగింది. కానీ నేటి తెలంగాణ ప్రభుత్వం దీనికి వ్యతిరేకంగా జీవో నెంబర్ 15 తీసుకొచ్చి టెస్కో ద్వారా కాకుండా బహిరంగ టెండర్ ద్వారా తీసుకోవాలని నిర్ణయిం చడం వలన నాలుగు నెలలుగా మగ్గాల ద్వారా ఉత్పత్తి అయిన వస్త్రాల కొనకపోవడం వలన మగ్గాలు మూతపడ్డాయి. చేనేత కార్మికులు రోడ్డున పడి అడుక్కుతినే పరిస్థితి ఏర్పడింది. ఈ ప్రభుత్వానికి కాంట్రాక్టులు, కమీషన్ల పైనే ఆసక్తి ఉంది తప్ప, చేనేత రంగ సమస్యలు మాత్రం పట్టిం చుకోకుండా మూలిగే నక్క మీద తాటికాయ వద్ద చందాన కొత్తగా తెచ్చిన టెండర్ విధానం చేనేత రంగానికి, చేనేత కార్మికులకు తీవ్ర నష్టం జరగడమే కాకుండా సహకార సంఘాలను నిర్వీర్యం చేసేందుకే ప్రభుత్వం కుట్రచేస్తుంది. చేనేత నూతన టెండర్ విధానం తక్షణ మే రద్దుచేసి పాత టెండర్ విధానాన్ని అమలు చేయాలి.

చేనేత భరోసా పథకం

చేనేత సహకార సంఘాలకు 13ఏళ్లుగా ఎన్నికలు నిర్వహించకుండా 15 దఫాలుగా చేనేత సహకార సంఘాలకుపర్సన్ ఇంఛార్జిలతో కొనసాగించి సంఘాలను తీవ్ర నష్టానికి గురి చేసిఎట్టకేలకు ఎన్నికలు నిర్వహించింది. కానీ వెంటనే టెస్కోకు పూర్తి పాలకవర్గాన్ని ఏర్పాటు చేసి సహకార సంఘాలకు రక్షణగా నిలవాలి. 30నెలల కాంగ్రెస్ ప్రభుత్వం సభల ద్వారా చేనేత రుణమాఫీ చేస్తామని పదేపదే చెప్పి అమలు చేయలేదు. కానీ చేనేత కార్మికుల పోరాటాలద్వారా ఎట్టకేలకు ఎంతో కాలంగా ఎదురుచూసిన చేనేత కార్మికుల చేనేతల రుణమాఫీ జరిగింది. చేనేత పొదుపు పథకం ఏప్రిల్ 25 నుండి అమలులో ఉన్నప్పటికీ చేనేత కార్మికులు 16 నెల లుగా క్రమంతప్పకుండా రికవరీ డిపాజిట్ బ్యాంక్ ఖాతాలో జమ చేయగా ప్రభుత్వవాటా మాత్రం కేవలం రెండునెలలు మాత్రమే జమ చేసింది. తక్షణమే ప్రభుత్వ వాటాను చేనేత కార్మికుల ఖాతాలో జమ చేయాలి. చేనేత భరోసా పథకం కార్మికులకు సంవత్సరానికి 18వేలు, అనుబంధ కార్మికునికి 6000 వేలు అందజేస్తామని ప్రకటించినప్పటికీ ఇప్పటికీ అమలుకు నోచుకోలేదు, వెంటనే అమలు చేయాలి. తెలంగాణ చేనేత సహకార సంఘాలకు ఇచ్చిన క్యాష్ క్రెడిట్ రుణాలు మాఫీచేస్తామని ఇప్పటికీ అమలుజరగలేదు. ఎలాంటి షర తులు లేకుండా చేనేత బీమా పథకంలో 60 సంవత్సరాలు పైబడినవారికి నష్టపరిహారం ప్రభుత్వం వద్ద 16 నెలలుగా పెండింగ్లో ఉన్నాయి. విడుదల చేయాలి. 28 నెలలుగా పావలా వడ్డీ పథకం ద్వారా చేనేత సహకార సంఘాలకు ఇవ్వాల్సిన పావలా వడ్డీ రుణాలు వెంటనే విడుదల చేయా లి.

Handloom

చేనేత వృత్తులకు పునర్జీవం

చేనేత సహకార సంఘాలకు ఇవ్వాల్సిన మార్కెటింగ్ ప్రోత్సాహకాలు 20శాతం రిబేట్ విడుదల చేయాలి. నకిలీ ప్రింటెడ్ వస్త్రాల అరికట్టి చేనేత రిజర్వేషన్ చట్టాన్ని పటి ష్టంగా అమలు చేయాలి. రైతుల ధాన్యం కొనుగోలు చేసిన ట్లుగా చేనేత వస్త్రాలు, దేవతామూర్తులకు సమర్పించే వస్త్రాలు, భక్తులకు అందించే ఆశీర్వచన వస్త్రాలు చేనేతలో తయారైతే దైవ సేవతోపాటు సంప్రదాయ సంరక్షణ కూడా సాధ్యమవుతూ దేవాలయాలకు ప్రతి సంవత్సరం లక్షలాది వస్త్రాలు అవసరమవుతాయి కాబట్టి, ఈ అవసరాన్ని చేనేత రంగం ద్వారా తీర్చే విధానాన్ని ప్రభుత్వాలు అమలు చేస్తే వేలాదిమంది చేనేత కార్మికులకు స్థిరమైన ఉ సాధిలభిస్తుంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతూ అంతరించిపోతు న్న సంప్రదాయ చేనేత వృత్తులకు పునర్జీవం లభిస్తుంది. భారత ప్రభుత్వం చేనేత దినోత్సవాన్ని ప్రకటించి దశాబ్ద కాలం గడిచినా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశ విదేశా లలో తరచుగా మాట్లాడుతూ విశ్వగురు పాత్ర పోషించే అవకాశం కేవలం చేనేత రంగానికే ఉందని చెబుతున్నా చేనేతరు సంబంధించిన అన్ని రకాల వస్త్ర ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం ఎన్నడు లేని విధంగా టెక్స్టైల్స్తో సమానంగా చేనేతకు జిఎస్టిని విధించింది. అంగట్లో అన్నీ ఉన్నా అల్లునినోట్లో శని అన్నట్టు బడ్జెట్ కాగితాల్లో వేల కోట్లు కనిపిస్తున్నా చేనేతకు అరకొర నిధులు కేటాయిస్తు న్నారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి నిధుల కొరతతో కొట్టుమిట్టాడుతుంటే ప్రభుత్వాలు మాత్రం వందల కోట్లు ఖర్చు చేస్తూ పర్యటనలు ప్రచారాలతో హంగు ఆర్భాటాలతో వృథా ఖర్చు చేస్తున్నారు. పాలకులకు చేనేత సంక్షేమంపై నిజమైన చిత్తశుద్ధి ఉంటే ప్రచారాల ఆర్బా టాల వెనుక ఉన్న వృధా ఖర్చులను తక్షణమే అరికట్టి వందల కోట్లను నేరుగా చేనేత రంగానికి మళ్ళిస్తేనే చేనేత కార్మికుల జీవితాల్లో వెలుగులు నిండుతాయి.

-డాక్టర్ చిక్కా దేవదాసు

Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

artisans Breaking News Handloom Handloom industry latest news Latest Telugu News Telugu News traditional textiles Vaartha weaving

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.