📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest Telugu news : H1B visa -అమెరికా మోజుకు బూజు పట్టనుందా?

Author Icon By Sudha
Updated: September 23, 2025 • 2:41 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమెరికా పెద్దరికం హాస్యాస్పదంగా మారింది. అమెరికా అధ్యక్షుని అహంకారం భారత్ వంటి దేశాల పాలిట
అమర్యాదకరంగా మారింది. ఇటీవల డోనాల్డ్ ట్రంప్ (Donald Trump)తీసుకుంటున్న నిర్ణయాల వలన భారత్ కొంతకాలం పాటు ఇబ్బందులకు గురికాక తప్పదు. విద్య కోసం, ఉపాధి కోసం, ఇతర దేశాల మీద ఆధారపడితే ఎంత అనర్ధమో ఇటీవల అమెరికా తీసుకుంటున్న నిర్ణయాల వలన అవగతమవుతున్నది. ఎక్కడున్నాక్షణాల్లో అమెరికాకు వచ్చేయాలని మైక్రోసాఫ్ట్ వంటి టెక్ దిగ్గజాలు తమ సంస్థల్లో పని చేసే ఉద్యోగులకు హుకుం జారీ చేయడం, హెచ్1బి వీసాదారులపై (H1B visa) ట్రంప్ కొరడా ఝళిపించడం, అమెరికా లో ఎం. ఎస్ చేసి, ఉద్యోగాలు సంపాదించి, అక్కడే విలాసవంతమైన జీవితాలు గడపాలనుకునేఆశావహులకు డోనాల్డ్ ట్రంప్ వీసా (H1B visa) నిబంధనలు, గోల్డ్ కార్డు గొడవలు తీవ్రనిరాశను కలిగించాయి. “మేక్ అమెరికా గ్రేట్అగైన్” అనే ఎన్నికల నినాదాన్ని ట్రంప్ వివాదాస్పదం చేసి, భారత్ వంటి దేశాల శ్రమశక్తిని, మేధాసంపత్తిని మానవవనరులను అడ్డగోలు విధానాల ద్వారా దోచుకుని, తన దేశ ఖజానా నింపుకోవడానికి నిర్లజ్జగా ప్రవర్తించడం సిగ్గుచేటు. శతాబ్దాల సుదీర్ఘ చరిత్ర గల లిఖిత రాజ్యాంగంతో, ధృడమైన ప్రజాస్వామ్య దేశం గా ప్రపంచ చరిత్రలో స్థానం సం పాదించుకున్న అమెరికా ప్రతిష్ట నేడు డోనాల్డ్ ట్రంప్ చేష్టలతో మసకబారిపోతున్నది. ట్రంప్ చర్యలు అమెరికాలో ప్రజస్వామ్యాన్ని పాతరేసి, నియంతృత్వం వైపు పయనింపచేస్తున్నాయి. గ్లోబల్ మైండ్ సెట్ తో ప్రపంచానికి పెద్దన్నలావ్యవహరించి, అగ్రరాజ్యమనే హోదాతో ప్రపంచంలో ఇప్పటి వరకు అమెరికా తనకున్న బ్రాండ్ ను కాపాడుకుంటూవచ్చింది. అయితే ఏ దుర్ముహుర్తాన డోనాల్డ్ ట్రంప్ రెండవ సారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టారో, అప్పటి నుంచే ప్రపంచ దేశాలకు వాణిజ్య పరమైన, దౌత్యపరమైన ఇబ్బందులు తలెత్తాయి. అసలే ఆర్థిక మాంద్యంతో అతలాకుతలమైపోతున్నప్రపంచ దేశాలకు ట్రంప్ నిర్ణయాలు గోరుచుట్టుపై రోకలిపోటులా పరిణమించాయి. గత కొన్ని సంవత్సరాలుగా భారత్ తోసన్నిహిత సంబంధాలు సాగించిన అమెరికా తన వైఖరిని మార్చుకుని భారత్ ఆర్థిక వ్యవస్థ పునాదులను పెకలించడానికిఅనేక దుష్కృత్యాలకు ఒడిగట్టింది. రెసిప్రోకల్ టారిఫ్ ల పేరుతో భారత్ పై ట్రేడ్ వార్ సాగిస్తూనే మరో వైపు భారతీయుల అమెరికా ప్రవేశానికి అడ్డుకట్ట వేయడానికి హెచ్ వన్ బి వీసాలను(H1B visa) క్లిష్టతరం చేసింది.

H1B visa -అమెరికా మోజుకు బూజు పట్టనుందా?

ఆర్ధిక భారాన్ని తట్టుకోలేక, నైపుణ్యం గల వర్క్ ఫోర్స్ కోసం అమెరికా కంపెనీలు తమ తయారీ యూనిట్లను ఇండియాలో దెలకొల్పడానికి ఉత్సుకత చూపుతున్నాయి. ఐఫోన్ల కోసం క్యూలో నిలబడి కొట్టుకుంటున్న వారు వాటి తయారీ యూనిట్లు భారత్ లో ఉన్నాయన్న సంగతి గుర్తుంచుకోవాలి. కారు చౌకగా లభించే భారతీయ నైపుణ్యాన్ని ట్రంప్ తన దురహంకారంతో కాలదన్నుకోవడం మూర్ఖత్వం. నోబెల్ శాంతి బహుమతి కోసం అర్రులు చాస్తూ, భారత్ పాక్ యుద్ధంతో సహా ఏడు యుద్ధాలను తానే ఆపానంటూ, తనకే నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలంటూ ట్రంప్ తాజాగా చేసిన హెచ్చరికతో కూడిన వేడుకోలు అత్యంత హాస్యాస్పదం. చిరకాల మిత్ర దేశంగా కొనసాగుతున్న రష్యా తో ఆయుధ, వాణిజ్య సంబంధాలు తెంచుకోవాలని, రష్యా చమురు కొనుగోలు చేయవద్దని, భారత్ ను హెచ్చరించడం అనుచితం. ఏ సార్వభౌమత్వ దేశం కూడా ఇలాంటి హెచ్చరికలను ఖాతరు చేయబోదనే సంగతి ట్రంప్ గుర్తించాలి. ఒక వైపు భారత్ గొప్ప దేశమంటూ, మోడీ తన ప్రియమితృడంటూ పొగడ్తలు కురిపిస్తూనే, మరో వైపు ట్రేడ్ వార్ కొనసాగించడం, ఇంకో వైపు భారతీయులను అమెరికా నుండి గెంటేయడానికి, అమెరికాలో భారతీయుల విద్యా, ఉద్యోగ అవకాశాలకు గండికొట్టే చర్యలను వేగవంతం చేయడం కర్రు కాల్చివాత పెట్టి, వెన్న పూయడం లాంటి ఘాతుకంగా భావించక తప్పదు. డోనాల్డ్ ట్రంప్ అనాలోచిత అహంకార పూరితదుందుడుకు చర్యలు, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు అమెరికా న్యాయ స్థానాల్లో నిలబడే అవకాశాలు కూడా తక్కువ. ట్రంప్ చర్యలను స్వయంగా రిపబ్లికన్ పార్టీ నేతలే జీర్ణించుకోలేక పోతున్నారు. ఇక ప్రతిపక్షాల సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అమెరికాలో తక్కువ జీతాలకు పనిచేసే నిపుణులు దొరకడం కష్టం. కాబట్టి టెక్ దిగ్గజాలు ఎక్కువ జీతాలకే స్థానికులను నియమించుకోవడం వలన అమెరికా పౌరులకు లాభం. ఇదే సందర్భంలో ఆయా కంపెనీలు లాభాలు ఆర్జించలేక, దివాళా తీయడమో, భారత్, చైనా ల నుంచి తమ కార్యక్రమాలను కొనసాగించడమో చేయక తప్పదు. ఏది ఏమైనప్పటికీ అమెరికా పై మనకున్న మోజుకు బూజు పట్టనుందా? అంటే అవుననే సమాధానమే వస్తుంది.
– సుంకవల్లి సత్తిరాజు

హెచ్1బీ వీసా అంటే ఏమిటి?

H-1B అనేది యునైటెడ్ స్టేట్స్‌లో వలసేతర వీసా యొక్క వర్గీకరణ, ఇది US యజమానులు ప్రత్యేక వృత్తులలో విదేశీ కార్మికులను, అలాగే ఫ్యాషన్ మోడల్‌లను లేదా కొన్ని షరతులను తీర్చగల రక్షణ శాఖ ప్రాజెక్టులలో నిమగ్నమై ఉన్న వ్యక్తులను నియమించుకోవడానికి అనుమతిస్తుంది.

ఎవరు h1b వీసా కోసం అర్హులు?

కనీసం బ్యాచిలర్ డిగ్రీ అవసరమయ్యే H-1B వీసాలు, టెక్ కంపెనీలు భర్తీ చేయడం కష్టంగా భావించే అధిక నైపుణ్యం కలిగిన ఉద్యోగాల కోసం ఉద్దేశించబడ్డాయి. ఈ కార్యక్రమం అమెరికన్ కార్మికులను తగ్గిస్తుందని, సంవత్సరానికి $60,000 కంటే తక్కువ జీతంతో పనిచేయడానికి సిద్ధంగా ఉన్న విదేశాల నుండి వచ్చే వ్యక్తులను ఆకర్షిస్తుందని విమర్శకులు అంటున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

American dream Breaking News H1B visa immigration policy latest news tech jobs Telugu News US Immigration

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.