Gyanesh Kumar CEC: దేశంలో ఎన్నికల వేడి మొదలైంది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అసోం, కేరళ రాష్ట్రాలతో పాటు పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతానికి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ఆదివారం ప్రకటించింది. మొత్తం 824 నియోజకవర్గాల్లో సుమారు 17.4 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. షెడ్యూల్ విడుదలైన క్షణం నుంచే ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ (Model Code of Conduct) అమల్లోకి వచ్చింది.
Read also: West Bengal Election Schedule 2026: బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తేదీలు ప్రకటించిన ఈసీ.. ఆ రోజే ఫలితాలు!
సిఈసి కీలక వ్యాఖ్యలు: ‘కోడ్‌కు ముందే నిర్ణయాలు’
ఎన్నికల తేదీల ప్రకటనకు కొద్ది గంటల ముందు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన వరాల జల్లుపై చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ స్పష్టతనిచ్చారు. ఎన్నికల కోడ్ అమల్లోకి రాకముందు ప్రభుత్వాలు తీసుకునే విధానపరమైన నిర్ణయాల్లో తాము జోక్యం చేసుకోలేమని ఆయన పేర్కొన్నారు. కేవలం కోడ్ అమల్లో ఉన్న సమయంలోనే నిబంధనల ఉల్లంఘనలపై చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. హింస, ప్రలోభాలకు తావు లేకుండా పారదర్శకంగా ఎన్నికలు నిర్వహిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
Gyanesh Kumar CEC: రాష్ట్రాల వారీగా ఎన్నికల షెడ్యూల్
| రాష్ట్రం / UT | నియోజకవర్గాలు | పోలింగ్ తేదీ(లు) | విడతలు |
| అసోం | 126 | ఏప్రిల్ 9, 2026 | ఒకే విడత |
| కేరళ | 140 | ఏప్రిల్ 9, 2026 | ఒకే విడత |
| పుదుచ్చేరి | 30 | ఏప్రిల్ 9, 2026 | ఒకే విడత |
| తమిళనాడు | 234 | ఏప్రిల్ 23, 2026 | ఒకే విడత |
| పశ్చిమ బెంగాల్ | 294 | ఏప్రిల్ 23, 29 | రెండు విడతలు |
రాజకీయ వ్యూహాలు – వరాల జల్లు
షెడ్యూల్ వెలువడటానికి ముందు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం పురోహితులు, మౌజన్‌ల గౌరవ వేతనాన్ని రూ. 500 పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అటు తమిళనాడులో డీఎంకే సర్కార్ గత నెలలోనే కోటి మందికి పైగా మహిళల ఖాతాల్లో రూ. 5,000 జమ చేయగా, దానికి పోటీగా తాము అధికారంలోకి వస్తే రూ. 10,000 ఇస్తామని బీజేపీ నేత అన్నామలై ప్రకటించారు. ఈ పరిణామాలు ఎన్నికల బరిలో పోటీ ఎంత తీవ్రంగా ఉండబోతుందో సూచిస్తున్నాయి.
hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: