📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Gutka: ఒడిశా Govt సంచలన నిర్ణయం..పొగాకు ఉత్పత్తులు బ్యాన్

Author Icon By Aanusha
Updated: January 22, 2026 • 7:32 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఒడిశా ప్రభుత్వం, ప్రజారోగ్యాన్ని ప్రధాన లక్ష్యంగా చేసుకుని సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా, పొగాకు, నికోటిన్ కలిగిన అన్ని రకాల ఉత్పత్తులపై పూర్తిస్థాయి నిషేధం విధిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు బుధవారం (జనవరి 21) రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నిర్ణయంతో గుట్కా (Gutka), పాన్ మసాలా, జర్దా, ఖైనీ వంటి ఉత్పత్తులు ఇకపై ఒడిశా రాష్ట్రంలో ఎక్కడా అందుబాటులో ఉండవు. ఇప్పటికే ఒడిశాలో పొగాకు, నికోటిన్ ఉత్పత్తులపై నిషేధం ఉంది. అయితే గతంలో ఉన్న ఉత్తర్వులను సవరించింది.

Read Also: Chhattisgarh steel plant blast : స్టీల్ ప్లాంట్‌లో పేలుడు, ఏడుగురు కార్మికులు సజీవ దహనం!

Gutka: Odisha Govt takes a sensational decision.. bans tobacco products

వేర్వేరు ప్యాకెట్ల అమ్మకం

2013లో ఉన్న పాత నిబంధనలను రద్దు చేస్తూ.. కొత్తగా నోటిఫికేషన్ (జీఓ నంబర్ 2065) జారీ చేశారు. ఈ మేరకు ఒడిశా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ బుధవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. గతంలో ఉన్న చట్టపరమైన లొసుగులను తొలగించి, నిబంధనలను మరింత కఠినతరం చేశారు.

ఇప్పటివరకు కొన్ని సంస్థలు పొగాకు, పాన్ మసాలాను విడివిడిగా విక్రయించి నిబంధనల నుంచి తప్పుకునేవి.ఇప్పుడు అలాంటి వేర్వేరు ప్యాకెట్ల అమ్మకం కూడా చట్టవిరుద్ధం కానుంది.పొగాకు, నికోటిన్ ఉత్పత్తుల కారణంగా క్యాన్సర్ ముప్పు వస్తుందని భావించిన ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

latest news Odisha Government Telugu News Tobacco Ban

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.