ప్రజల ప్రాణ భద్రత కోసం ప్రభుత్వం హెల్మెట్ ధరించడం తప్పనిసరి చేసింది. అయితే గుజరాత్‌లోని(Gujarat) సూరత్(Surat) నగరంలో ఈ నిబంధనకు వ్యతిరేకంగా మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు రోడ్డెక్కారు. ట్రాఫిక్ పోలీసులు కొన్ని నెలల క్రితం ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించిన తరువాత ఈ ఆందోళన చెలరేగింది. నగరంలోని ప్రధాన రహదారులపై మహిళలు హెల్మెట్లను రోడ్డుపై విసిరి, “హెల్మెట్ తప్పనిసరి నిబంధనను రద్దు చేయాలి” అని డిమాండ్ చేశారు. ఈ సంఘటన వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది.
Read also: E-commerce: అమెజాన్ లో భారీగా లేఅఫ్స్
సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోపై విమర్శల వెల్లువ
@gemsofbabus అనే సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసిన వీడియోలో, మహిళా కార్యకర్తలు హెల్మెట్లను రోడ్డుపై విసిరి నిరసన వ్యక్తం చేస్తున్నట్లు కనిపిస్తోంది. పోలీసులు నిరసనకారిణులను అదుపులోకి తీసుకొని పోలీసు వాహనాల్లో తరలించారు.ఈ వీడియో అక్టోబర్ 12న షేర్ చేయబడగా, లక్షల్లో వ్యూస్ సాధించింది. నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. “హెల్మెట్‌లు ప్రాణాలను కాపాడుతాయి. వీటిని వ్యతిరేకించడం విచిత్రం” అని పలువురు వ్యాఖ్యానించారు. ఒకరు “87% ద్విచక్ర వాహన ప్రమాద మరణాలు హెల్మెట్ లేకపోవడం వల్లే జరుగుతున్నాయి. భద్రతను రాజకీయంగా మార్చొద్దు” అంటూ కామెంట్ చేశారు.
ప్రజా భద్రత కంటే రాజకీయమేనా?
Gujarat: ప్రాణ భద్రత కోసం రూపొందించిన హెల్మెట్ నిబంధనను రాజకీయంగా ఉపయోగించకూడదని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలను రక్షించగల ఈ సాధారణ నిబంధనపై మహిళా కాంగ్రెస్ ఆందోళన వివాదానికి దారి తీసింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: