📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Bomb threats : బాంబు బెదిరింపులకు పాల్పడిన మహిళా ఇంజినీర్‌ అరెస్ట్

Author Icon By Sudha
Updated: June 24, 2025 • 5:03 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మోదీ స్టేడియం (Narendra Modi stadium) లో బాంబులు పెట్టాం, బీజే మెడికల్ కాలేజీ (BJ Medical college) లో బాంబులు పెట్టాం అంటూ గుజరాత్‌కు ఇలా వరుసగా 21 బాంబు బెదిరింపులకు పాల్పడి అమాయక ప్రజలను భయబ్రాంతులకు గురిచేయడమేగాక, భద్రతా సిబ్బందిని ఉరుకులు పరుగులు పెట్టించిన మహిళను పోలీసులు అరెస్ట్‌ చేశారు. అహ్మదాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు తమిళనాడు రాజధాని చెన్నైలోని ఆమె నివాసంలోనే ఆమెను అదుపులోకి తీసుకున్నారు. చెన్నైలోని ఓ మల్టీనేషనల్‌ కంపెనీలో సీనియర్‌ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్న మహిళా ఇంజినీర్‌ రెనె జోషిడా(Rene Joshida)నే వరుస బాంబు బెదిరింపులకు పాల్పడినట్లు గుర్తించిన పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్‌ చేశారు. ఎందుకు బాంబు బెదిరింపులకు పాల్పడ్డావని ప్రశ్నించిన పోలీసులకు జోషిడా చెప్పిన సమాధానం షాక్‌కు గురిచేసింది.

Bomb threats : బాంబు బెదిరింపులకు పాల్పడిన మహిళా ఇంజినీర్‌ అరెస్ట్

కక్ష సాధించేందుకే ..
తాను ప్రేమించిన విజయ్‌ ప్రభాకర్‌ అనే వ్యక్తి తనను కాకుండా మరో అమ్మాయిని పెళ్లిచేసుకున్నాడని, అతడిపై కక్ష సాధించేందుకే అతడి పేరుతో మెయిల్‌ ఐడీలు సృష్టించి బాంబు బెదిరింపు మెయిల్స్‌ పంపానని జోషిడా తెలిపింది. బెదిరింపు మెయిల్స్‌ కేసులో అతడు ఇరుక్కుంటాడని భావించినట్లు చెప్పింది. అయితే తనను గుర్తించకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్న జోషిడా.. ఒక చిన్న మిస్టేక్‌ చేసి దొరికిపోయిందని పోలీసులు వెల్లడించారు.
12 రాష్ట్రాలకు బెదిరింపు
సదరు మహిళ గుజరాత్‌తోపాటు మొత్తం 12 రాష్ట్రాలకు బెదిరింపు మెయిల్స్‌ చేసిందని తెలిపారు. ఆమె తాను పెళ్లి చేసుకోవాలనుకున్న వ్యక్తిపై కక్ష సాధిస్తున్నానని మాత్రమే అనుకుంది తప్ప.. తన చర్యలవల్ల వేల మంది అమాయకులు భయబ్రాంతులకు గురవుతున్నారనే విషయాన్ని మర్చిపోయిందని అన్నారు. ఆమెపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. జోషిడా ఒక్క గుజరాత్‌కే 21 బెదిరింపు మెయిల్స్‌ పంపిందని, అందులో ఒక్క నరేంద్రమోదీ స్టేడియానికే 13 మెయిల్స్‌ చేసిందని సైబర్‌ క్రైమ్‌ పోలీసులు వెల్లడించారు. అదేవిధంగా జెనీవా లిబరల్‌ స్కూల్‌కు నాలుగు మెయిల్స్‌, దివ్యజ్యోతి స్కూల్‌కు మూడు మెయిల్‌లు, బీజే మెడికల్‌ కాలేజీకి ఒక మెయిల్‌ చేసిందని తెలిపారు.
గుజరాత్‌తోపాటు మహారాష్ట్ర, రాజస్థాన్‌, తమిళనాడు, ఢిల్లీ, కర్ణాటక, కేరళ, బీహార్‌, తెలంగాణ, పంజాబ్‌, మధ్యప్రదేశ్‌, హర్యానా రాష్ట్రాలు జోషిడా నుంచి బెదిరింపు మెయిల్స్‌ అందుకున్న రాష్ట్రాల జాబితాలో ఉన్నాయని పోలీసులు చెప్పారు.

Read Also:LPG pipeline: త్వరలోనే అతి పొడవైన LPG పైప్ లైన్

#BombSquad #bombthreat #GujaratPolice #IPL2025 #NarendraModiStadium #SecurityAlert Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.