Gujarat Crime: అన్నను చంపి .. ఆపై గర్భిణీ వదినపై అత్యాచారం

Read Time:  1 min
Gujarat Crime
Gujarat Crime
FONT SIZE
GET APP

గుజరాత్ (Gujarat Crime) రాష్ట్రంలోని జునాగఢ్ జిల్లాలో ఓ భయంకర సంఘటన చోటుచేసుకుంది. బీహార్‌ నుంచి వలస వచ్చిన కుటుంబంలో 15 ఏళ్ల బాలుడు సొంత అన్నను హత్య చేసి, ఆరు నెలల గర్భవతైన వదినపై అత్యాచారం చేసి చంపిన ఘటన స్థానికులను షాక్‌కు గురి చేసింది. అంతేకాకుండా, ఈ నేరాన్ని దాచిపెట్టడానికి తల్లితో కలిసి మృతదేహాలను ఇంటి వెనుక పాతిపెట్టి, చుట్టుపక్కల వారిని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు.

Read Also: Tirupati Crime: మహిళా కస్టమర్‌కు ముద్దు పెట్టిన ర్యాపిడో రైడర్

Gujarat Crime

కుటుంబ నేపథ్యం

జునాగఢ్ జిల్లా గ్రామీణ ప్రాంతంలోని ఓ ఆలయంలో పూజారిగా పనిచేసిన కుటుంబ తండ్రి కొవిడ్ మహమ్మారిలో ప్రాణాలు కోల్పోయాడు. తండ్రి మరణం తరువాత కుటుంబ బాధ్యత పెద్ద కొడుకు భుజాన వేసుకున్నాడు. అతను ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తూ తల్లి, తమ్ముడిని పోషించేవాడు. తర్వాత అతను పెళ్లి చేసుకుని స్థిర జీవితం మొదలుపెట్టాడు. భార్య ఆరు నెలల గర్భవతిగా ఉండేది.

ఇటీవలి కాలంలో అన్నాచెల్లెళ్ల మధ్య తరచూ తగాదాలు జరిగేవి. అన్న తరచూ తమ్ముడిని మందలించడం, కొట్టడం వల్ల అతనిలో పగ పెరిగింది. అక్టోబర్ 16న తమ్ముడు ఇనుప రాడ్‌తో అన్నపై దాడి చేసి హత్య చేశాడు. ఆ తర్వాత, వదినపై అత్యాచారం చేసి, ఆమెను కూడా చంపేశాడు.

నేరం దాచిపెట్టే ప్రయత్నం

తల్లి సాయంతో అన్నావదినల మృతదేహాలను నగ్నంగా ఇంటి వెనుక పాతిపెట్టారు.(Gujarat Crime) తరువాత, చుట్టుపక్కల వారికి “వాళ్లు బీహార్‌కు వెళ్లిపోయారు” అని అబద్ధం చెప్పారు. కానీ దీపావళి సందర్భంగా బీహార్‌లోని బంధువులు కాల్ చేసినా స్పందన రాకపోవడంతో అనుమానం మొదలైంది. తల్లిని ప్రశ్నించినప్పుడు ఆమె “వాళ్లు రోడ్డు ప్రమాదంలో చనిపోయారు” అని చెప్పడంతో బంధువులు మరింత ఆందోళనకు గురయ్యారు. పోలీసులకు ఫిర్యాదు చేయగా విచారణలో భయానక నిజం వెలుగులోకి వచ్చింది.

పోలీసులు మృతదేహాలను వెలికితీసినప్పుడు, మహిళ గర్భంలో ఉన్న పిండం కూడా బయటకు వచ్చినట్లు తేలింది. ఈ ఘోరానికి పాల్పడిన బాలుడిలో ఎలాంటి పశ్చాత్తాపం కనిపించకపోవడంతో అధికారులు కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. పోలీసులు హత్య కేసు నమోదు చేసి తల్లీకొడుకులను అరెస్టు చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

Shiva

రచయిత గురించి

Shiva

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.