Tobacco Products: పొగాకు ఉత్పత్తులపై జీఎస్టీ నేటి నుంచి అమల్లోకి

Read Time:  1 min
Tobacco Products: పొగాకు ఉత్పత్తులపై జీఎస్టీ నేటి నుంచి అమల్లోకి
FONT SIZE
GET APP

పొగాకు ఉత్పత్తుల (Tobacco Products) పై 40 శాతం జీఎస్టీని విధిస్తూ కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్ నేటి నుంచి అమల్లోకి వచ్చింది. ఈ పన్నుతో పాటు అదనంగా ఎక్సైజ్ డ్యూటీ, హెల్త్ సెస్ విధించడంతో సిగరెట్లు, పాన్ మసాలా, గుట్కాల వంటి వాటి ధరలు భారీగా పెరిగాయి. హానికర ఉత్పత్తుల వినియోగాన్ని తగ్గించేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రభుత్వానికి అధిక ఆదాయం వచ్చే అవకాశం కూడా ఉంది.ఇప్పటివరకు ఉన్న 28 శాతం జీఎస్‌టీ ప్లస్ కాంపెన్సేషన్ సెస్ స్థానంలో..

Read Also: Union Budget: బడ్జెట్‌కు ముందు రాష్ట్రపతి భవన్‌లో దహీ–చినీ సంప్రదాయం

పన్నులు ఖరారు

ఇప్పుడు 40 శాతం జీఎస్‌టీతో పాటు అదనపు ఎక్సైజ్ డ్యూటీ, హెల్త్ సెస్ విధిస్తున్నారు. దీనివల్ల సిగరెట్ల ధరలు 15 నుంచి 40 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది. సిగరెట్ పొడవు, ఫిల్టర్ రకాన్ని బట్టి పన్నులను ఖరారు చేశారు, 65 మి.మీ లోపు (నాన్-ఫిల్టర్) ఒక్కో సిగరెట్‌పై రూ. 2.05 అదనపు డ్యూటీ, 65 మి.మీ లోపు (ఫిల్టర్) ఒక్కో సిగరెట్‌పై రూ. 2.10 అదనపు డ్యూటీ, మీడియం (65-70 మి.మీ) ఒక్కో స్టిక్‌పై సుమారు రూ. 4 వరకు పెంచారు.

GST on tobacco products to come into effect from today
GST on tobacco products to come into effect from today

అలాగే, ప్రీమియం/లాంగ్ (70-75 మి.మీ) ఒక్కో స్టిక్‌పై రూ. 5.40 వరకు భారం పడనుంది. కొన్ని కేటగిరీల్లో 1000 సిగరెట్లపై రూ. 8,500 నుంచి రూ. 11,000 వరకు ఎక్సైజ్ డ్యూటీ పడనుంది.పాన్ మసాలా, గుట్కా తయారీదారులు ఇకపై తమ ప్యాకింగ్ మెషీన్ల సామర్థ్యం ఆధారంగా పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాకుండా, తయారీ కేంద్రాల్లో తప్పనిసరిగా CCTV కెమెరాలు, ఏర్పాటు చేసి ఆ ఫుటేజీని 24 నెలల పాటు భద్రపరచాలని ప్రభుత్వం ఆదేశించింది. పచ్చి పొగాకుపై 60-70 శాతం, ఈ-సిగరెట్లపై 100 శాతం పన్ను విధించడం ద్వారా ప్రభుత్వం తన కఠిన వైఖరిని స్పష్టం చేసింది.

Read hindi news : hindi.vaartha.com

Epaper: epapervaartha.com

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.