📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

GST Evasion : ఐదేళ్లలో రూ.7.08లక్షల కోట్ల పన్ను ఎగవేత ..కేంద్రం వెల్లడి

Author Icon By Sudha
Updated: August 4, 2025 • 5:27 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

2024-25 ఆర్థిక సంవత్సరం వరకు ఐదు సంవత్సరాల్లో దాదాపు రూ.7.08లక్షల కోట్ల పన్ను ఎగవేతను(GST Evasion) కేంద్ర జీఎస్టీ ఫీల్డ్‌ అధికారులు గుర్తించారు. ఇందులో దాదాపు రూ.1.79లక్షల కోట్ల ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ (ITC) మోసాలు ఉన్నాయని కేంద్రం తెలిపింది.ఆర్థిక సహాయ మంత్రి పంక్‌ చౌదరి లోక్‌సభలో వివరాలను వెల్లడించారు. డేటా ప్రకారం.. 2024-25 ఆర్థిక సంవత్సరంలోనే రూ.2.23 లక్షలకోట్లకుపైగా జీఎస్టీ ఎగవేతను (GST Evasion) సీజీఎస్‌టీ ఫీల్డ్‌ అధికారులు గుర్తించారని, 2025 ఆర్థిక సంవత్సరంలో 30,056 జీఎస్టీ ఎగవేత(GST Evasion) కేసులను గుర్తించినట్లు ప్రభుత్వం లోక్‌సభకు తెలిపింది. ఇందులో సగానికిపైగా ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌కు సంబంధించినవే ఉన్నాయని పేర్కొంది. ఈ కేసుల్లో రూ.58,772 కోట్ల పన్ను ఎగవేత జరిగిందని.. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.2.30 లక్షల కోట్ల జీఎస్టీ ఎగవేత, 2023 ఆర్థిక సంవత్సరంలో దాదాపుగా రూ.1.32లక్షల కోట్ల జీఎస్టీ ఎగవేతను గుర్తించారని, 2022 ఆర్థిక సంవత్సరంలో రూ.73,238కోట్లు, 2021 ఆర్థిక సంవత్సరంలో రూ.49,384 కోట్ల జీఎస్టీ ఎగవేత జరిగిందని అధికారులు గుర్తించారు. గడిచిన ఐదేళ్లలో సీజీఎస్టీ ఫీల్డ్‌ అధికారులు రూ.91,370 కేసుల్లో దాదాపు రూ.7.08 లక్షల కోట్ల జీఎస్టీ ఎగవేతను అధికారులు గుర్తించారన్నారు. ఈక ఆలంలో స్వచ్ఛంద డిపాజిట్ల ద్వారా వసూలు చేసిన పన్నులు రూ.1.29 లక్షల కోట్లకుపైగా ఉన్నాయి.

GST Evasion : ఐదేళ్లలో రూ.7.08లక్షల కోట్ల పన్ను ఎగవేత ..కేంద్రం వెల్లడి

2021 ఆర్థిక సంవత్సరం నుంచి 2025 ఆర్థిక సంవత్సరం మధ్య 44,938 కేసుల్లో దాదాపు రూ.1.79 లక్షల కోట్ల ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ పన్ను ఎగవేత వేసినట్లు కేంద్రం తెలిపింది. కేంద్ర ప్రభుత్వం, జీఎస్టీఎన్‌ పన్ను ఎగువేతను నివారించేందుకు వివిధ చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్రమంత్రి చౌదరి లోక్‌సభలో తెలిపారు. ఈ-ఇన్వాయిస్ ద్వారా డిజిటలైజేషన్, జీఎస్టీ రివ్యూ తదితర చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రభుత్వం తీసుకునే చర్యలన్నీ పన్ను ఎగవేతదారులను పట్టుకోవడంలో సహాయపడుతాయని చౌదరి లోక్‌సభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. సవరించిన అంచనాలతో (RE) పోలిస్తే వాస్తవ నికర కేంద్ర జీఎస్టీ వసూళ్లపై అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. 2024-25 ఆర్థిక సంవత్సరంలో నికర సీజీఎస్టీ వసూళ్లు సవరించిన అంచనాలలో 96.7 శాతమని చౌదరి అన్నారు. నికర సీజీఎస్టీలో సీజీఎస్టీ, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ, పరిహార సెస్ ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది. 2025 ఆర్థిక సంవత్సరంలో వాస్తవ వసూళ్లు రూ.10.26 లక్షల కోట్లకుపైగా ఉండగా, సవరించిన అంచనాలు దాదాపు రూ.10.62 లక్షల కోట్లు. 2024 ఆర్థిక సంవత్సరంలో నికర సీజీఎస్టీ వసూళ్లు రూ.9.57 లక్షల కోట్లకుపైగా ఉన్నాయి. సవరించిన అంచనాలు రూ.9.56 లక్షల కోట్లలో 100.1శాతం.

ఏ రంగాలు జిఎస్టి ఎగవేతకు గురవుతాయి?

DGGI నివేదిక ఆన్‌లైన్ గేమింగ్ మరియు బ్యాంకింగ్, ఆర్థిక సేవలు మరియు బీమా (BFSI) రంగాలను GST ఎగవేతకు ఎక్కువగా గురిచేస్తున్నట్లు గుర్తించింది. ఆన్‌లైన్ గేమింగ్ రంగం నుండి మాత్రమే రూ.81,875 కోట్లు ఎగవేత జరగగా, BFSI రంగంలో రూ.18,961 కోట్లు ఎగవేత జరిగింది.

పన్ను ఎగవేత యొక్క సాధారణ రూపం ఏమిటి?

ఆదాయాన్ని తక్కువగా నివేదించడం ఇప్పటికీ పన్ను ఎగవేత యొక్క అత్యంత సాధారణ రూపాలలో ఒకటి. వ్యాపార యజమానులు నగదు చెల్లింపులను నివేదించనప్పుడు, ఫ్రీలాన్సర్లు క్లయింట్ చెల్లింపులను దాచినప్పుడు లేదా కార్మికులు చిట్కాలను నివేదించనప్పుడు ఇది జరుగుతుంది. బ్యాంక్ డిపాజిట్ విశ్లేషణ ద్వారా అంతర్గత రెవెన్యూ సర్వీస్ ఈ సమస్యలను గుర్తించగలదు.

Read hindi news: epapervaartha.com

Read Also: US: అమెరికాలో పెట్టుబడుల కోసం భారతీయుల ఆసక్తి

Breaking News Central GST Financial Crime GST Evasion Indian Economy Input Tax Credit Scam latest news Tax Fraud Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.