हिन्दी | Epaper
11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం శబరిమల గోల్డ్ మాయం 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం శబరిమల గోల్డ్ మాయం 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం శబరిమల గోల్డ్ మాయం 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం శబరిమల గోల్డ్ మాయం

Grenade Attack: అమృత్‌స‌ర్‌లో గుడిపై గ్రేనేడ్ దాడి

sumalatha chinthakayala
Grenade Attack: అమృత్‌స‌ర్‌లో గుడిపై గ్రేనేడ్ దాడి

Grenade Attack : అమృత్‌స‌ర్‌లోని ఓ గుడిపై గ్రేనేడ్ దాడి జ‌రిగింది. శుక్ర‌వారం రాత్రి ఇద్ద‌రు వ్య‌క్తులు బైక్‌పై వ‌చ్చి హ్యాండ్ గ్రేనేడ్ విసిరిన‌ట్లు తెలిసింది. అర్థ‌రాత్రి గ్రేనేడ్ దాడి జ‌రిగిన‌ట్లు సీసీటీవీ ఫూటేజ్ ద్వారా పోలీసులు నిర్ధారించారు. పేలుడు వ‌ల్ల ఆల‌య గోడ స్వ‌ల్పంగా ధ్వంస‌మైంది. ఎవ‌రికీ గాయాలు కాలేదు. పూజారి, అత‌ని కుటుంబం.. ఆ గుడి పైభాగాన ఉంటున్నారు. వాళ్ల‌కు ఎటువంటి హాని జ‌ర‌గ‌లేదు.

అమృత్‌స‌ర్‌లో గుడిపై గ్రేనేడ్  దాడి

మ‌త‌పర‌మైన ప్ర‌దేశంపై దాడి

సీనియ‌ర్ పోలీసు అధికారుల ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని విచార‌ణ చేప‌డుతున్నారు. న‌గ‌రంలో తొలిసారి మ‌త‌పర‌మైన ప్ర‌దేశంపై దాడి జ‌రిగిన‌ట్లు పోలీసులు భావిస్తున్నారు. గ‌తంలో ఎక్కువ సార్లు అక్క‌డ పోలీసు స్టేష‌న్ల‌పై దాడులు జ‌రిగేవి. గ‌డిచిన నాలుగు నెల‌ల్లో గ్రేనేడ్ దాడి ఘ‌ట‌న చోటుచేసుకోవ‌డం ఇది 12వ‌సారి. దాడిని స్థానిక నేత కిర‌ణ్‌ప్రీత్ సింగ్ ఖండించారు. పంజాబ్‌లో ఉన్న శాంతికి విఘాతం క‌లిగించే కుట్ర జ‌రుగుతోంద‌న్నారు.

శాంతి, సౌహార్దానికి విఘాతం కలిగించే కుట్ర

పంజాబ్‌లో నెలకొన్న శాంతి, సౌహార్దానికి విఘాతం కలిగించే కుట్ర జరుగుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దాడికి పాల్పడిన వ్యక్తితోపాటు అతడి సహచరుడిని స్థానికులు అడ్డుకుని పట్టుకున్నారు. అనంతరం పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. కాగా, దాడికి ముందు నిందితులు ఆ ప్రాంతంలో రెక్కి నిర్వహించారని పోలీసులు వెల్లడించారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870