అందని ద్రాక్ష పుల్లన అనేలా కాంగ్రెస్ పార్టీ వైఖరి ఉందని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూశ్ గోయల్ (Piyush Goyal) విమర్శించారు. భారత్ – యూరోపియన్ యూనియన్ (ఈయూ) మధ్య ఖరారైన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ)పై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ చేసిన వ్యాఖ్యలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే ఎఫ్‌టీఏపై 2006లో ఈయూతో చర్చలను మొదలుపెట్టిన నాటి కాంగ్రెస్ సర్కారు ఎలాంటి ఫలితాన్నీ సాధించలేకపోయిందని పీయూశ్ గోయల్ తెలిపారు. అప్పట్లో కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి హోదాలో జైరాం రమేశ్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి పెను ఆటంకంగా నిలిచారన్నారు. ఈయూతో ఎఫ్‌టీఏను ఖరారు చేసుకునే చొరవను, సాహసాన్ని నాటి కాంగ్రెస్ సర్కారు చూపలేకపోయిందని ఆయన మండిపడ్డారు. కానీ తాజాగా ఈయూతో మోదీ సర్కారు ఎఫ్‌టీఏను ఖరారు చేసుకోవడాన్ని చూసి ఓర్వలేక, అందని ద్రాక్ష పుల్లన అనేలా జైరాం రమేశ్ మాట్లాడారని ధ్వజమెత్తారు.
Read Also: Maharashtra: NCP పార్టీ భవిష్యత్‌పై అనిశ్చితి..సీఎంతో నేతల భేటీ
ఈయూతో ట్రేడ్ డీల్ భారత ఆర్థిక వ్యవస్థకు లాభం
“ట్రేడ్ డీల్‌పై 2006లో ఈయూతో చర్చలను మొదలుపెట్టిన నాటి కాంగ్రెస్ సర్కారు, 2013లో వాటిని ఆపేసింది. చైనాతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడం భారతదేశ ప్రయోజనాలకు విరుద్ధమని తెలిసినా, ఆ ఒప్పందం దిశగా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నాలు చేసింది. దేశ ప్రయోజనాలను తాకట్టు పెట్టే అధికారాన్ని కాంగ్రెస్ పార్టీకి ఎవరు ఇచ్చారు? భారత తయారీ రంగ సంస్థలతో పోటీ పడే దేశాలతో కానీ, భారత తయారీరంగ సంస్థల కంటే తక్కువ కార్మిక వ్యయాలను కలిగిన సంస్థలున్న దేశాలతో కానీ ఎఫ్‌టీఏను కుదుర్చుకునే ప్రసక్తే లేదు. చైనాలాంటి దేశంతో ఎఫ్‌టీఏను కుదుర్చుకుంటే, భారత్‌లోని తయారీరంగ సంస్థలకు గడ్డుకాలం ఎదురవుతుంది. ఈ అంశాలు తెలిసినా జపాన్, దక్షిణ కొరియాలతో గతంలో కాంగ్రెస్ సర్కారు ఎఫ్‌టీఏలను కుదుర్చుకుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: