భవిష్యత్ అవసరాల కోసం దేశంలోని చాలా మంది ప్రజలు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) అకౌంట్‌లో నెలనెలా పొదుపు చేస్తుంటారు. ఇది ప్రభుత్వ పథకం కావడంతో భద్రత, పన్ను మినహాయింపులు, మంచి వడ్డీ లభించడం వల్ల పెద్ద సంఖ్యలో పెట్టుబడిదారులు(Government Savings Scheme) ఆసక్తి చూపుతున్నారు.
Read Also:NSC Scheme:పైసా రిస్క్ లేకుండా డబ్బు పెంచుకోవాలా? అయితే ఇలా చెయ్యండి!
కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పొదుపు పథకాలలో PPF ఒకటి అత్యంత ప్రజాదరణ పొందిన పథకం. మీరు ఏదైనా బ్యాంక్ లేదా పోస్టాఫీస్‌లో PPF అకౌంట్ ప్రారంభించవచ్చు. కనీసంగా నెలకు రూ.500 నుంచి పెట్టుబడి పెట్టొచ్చు. దీనికి 15 సంవత్సరాల లాకింగ్ పీరియడ్ ఉంటుంది. ఆ కాలం పూర్తయ్యాక పెద్ద మొత్తంలో నిధులు మీకు లభిస్తాయి.
రెండు PPF అకౌంట్లు ఉంటే ఏమవుతుంది?
ఒక వ్యక్తి తన పేరుపై ఒకే ఒక్క PPF అకౌంట్ మాత్రమే కలిగి(Government Savings Scheme) ఉండాలి. ఒక బ్యాంక్‌లో అకౌంట్ తెరిస్తే మరో బ్యాంక్ లేదా పోస్టాఫీస్‌లో మరో PPF అకౌంట్ తెరవడం నిబంధనలకు విరుద్ధం. ఇలా రెండో అకౌంట్ తెరిస్తే దాన్ని ఇర్రెగ్యులర్ అకౌంట్‌గా పరిగణిస్తారు. రెండో అకౌంట్‌లో పెట్టిన డబ్బుకు ఎలాంటి వడ్డీ లభించదు. ప్రైమరీ అకౌంట్‌కే వడ్డీ వర్తిస్తుంది.
రెండు అకౌంట్లను మెర్జ్ చేయవచ్చా?
వేర్వేరు బ్యాంకుల్లో రెండు PPF అకౌంట్లు తెరిచి ఉంటే వాటిని కలపడం (మెర్జ్) చేయవచ్చు. ఇందుకోసం సంబంధిత బ్యాంక్ లేదా పోస్టాఫీస్ అధికారులను సంప్రదించి అవసరమైన ప్రక్రియ పూర్తి చేయాలి. లేదా ఒక అకౌంట్‌ను మూసివేయడం కూడా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. 18 ఏళ్లలోపు పిల్లల కోసం తల్లిదండ్రులు ప్రత్యేకంగా PPF అకౌంట్ తెరవచ్చు. ఇది పిల్లల భవిష్యత్ విద్య, వివాహం వంటి అవసరాలకు మంచి పొదుపు మార్గంగా ఉంటుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: