📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Acid : ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్లక్ష్యం ..గర్భిణీ కడుపుపై యాసిడ్ రాసిన నర్సు

Author Icon By Sudha
Updated: June 28, 2025 • 4:34 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రభుత్వ ఆసుపత్రిలో చోటుచేసుకున్న ఈ ఘోర వైద్య నిర్లక్ష్య (Medical negligence) ఘటన తీవ్రంగా ప్రశ్నార్థకంగా నిలిచింది. ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. కాన్సు సమయంలో గర్భిణీ కడుపుపై ( Pregnant Woman’s Abdomen) మెడికల్‌ జెల్‌కు బదులు యాసిడ్‌ (Acid)ను నర్సు రాసింది. దీంతో ఆ మహిళ కడుపుపై యాసిడ్‌ వల్ల కాలిన గాయాలయ్యాయి (Got burns). ఈ బాధతోనే పండంటి బిడ్డకు ఆమె జన్మనిచ్చింది. మహారాష్ట్రలోని జల్నా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఖపర్ఖేడా గ్రామానికి చెందిన షీలా భలేరావు నిండు గర్భిణి. కాన్పు కోసం భోకర్దాన్‌లోని ప్రభుత్వ గ్రామీణ ఆసుపత్రిలో ఆమె చేరింది.

Acid : ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్లక్ష్యం ..గర్భిణీ కడుపుపై యాసిడ్ రాసిన నర్సు


నిర్లక్ష్యంపై దర్యాప్తు
కాగా, శుక్రవారం ఆ మహిళకు ప్రసవ నొప్పులు వచ్చాయి. అయితే డెలివరీ ప్రక్రియలో ఉపయోగించే మెడికల్ జెల్లీగా భావించిన నర్సు ఆ బాటిల్‌లో ఉన్న హైడ్రోక్లోరిక్ యాసిడ్‌ను గర్భిణి కడుపుపై రాసింది. దీంతో ఆ మహిళ కడుపుపై యాసిడ్‌ వల్ల కాలిన గాయాలయ్యాయి. ఆ బాధతోనే ఆరోగ్యకరమైన బిడ్డకు ఆమె జన్మనిచ్చింది. మరోవైపు టాయిలెట్‌ క్లీనింగ్‌ కోసం వినియోగించే యాసిడ్‌ను పారిశుద్ధ్య సిబ్బంది పొరపాటున మెడికల్‌ ట్రేలో ఉంచినట్లు ఆసుపత్రి అధికారి తెలిపారు. ఈ నిర్లక్ష్యంపై దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.ఆసుపత్రిలో శానిటేషన్ సిబ్బంది ఆమ్లం ఉన్న బాటిలును మెడికల్‌ జెల్ ట్రేలపై ఉంచారు. అదే బాటిలును నర్సు తప్పుడు గమనించి వేయడంతో ఈ మిశ్రమం జరిగింది .
ఆసుపత్రుల్లో సిబ్బందికి సరైన శిక్షణ లేదని, సాధారణ మెడికల్ పరికరాలను కూడా ఒకరితో ఒకరు భేదం పెట్టడంలో వైఫల్యం చోటుచేసుకుంది.డాక్టర్ మరియు సంబంధిత అధికారులు వెంటనే విచారణ చేపట్టామని ప్రకటించినప్పటికీ, తక్షణంగా బాధితుడికి సముచిత పరిహారం, వైద్య సహాయం అందించేందుకు చర్యలు తీసుకోవాలి.ప్రసవ సమయంలో ఏర్పాటు చేసే ‘ట్రే’లను ఒకటిగా సమరూపం గల ద్రవాలతో భద్రతగా ఉంచడంపై మరింత పెద్ద ఎత్తున యంత్రాంగాలు మరింత అవశ్యకంగా ఉన్నాయి.

Read Also:Karnataka: కర్ణాటక పులుల మృతిపై వీడిన మిస్టరీ

#AcidBurn #GovernmentHospital #MedicalNegligence #PatientSafety #ProbeOrdered Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.