ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ (Google) విడుదల చేసిన లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ గూగుల్ పిక్సెల్ 10 (Google Pixel)పై భారీ డిస్కౌంట్‌ను ప్రముఖ రిటైలర్ విజయ్ సేల్స్ (Vijay Sales) ప్రకటించింది. రూ.79,999 ప్రారంభ ధరతో విడుదలైన ఈ ఫోన్‌పై నేరుగా రూ.5,000 ఫ్లాట్ డిస్కౌంట్ లభిస్తుంది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కార్డు ద్వారా ఈఎంఐపై కొనుగోలు చేస్తే రూ.7,000 వరకు, ఐసీఐసీఐ బ్యాంక్ కార్డుపై 5% అదనపు రాయితీతో కలిపి మొత్తం రూ.12,000 వరకు ఆదా చేసుకునే అవకాశం ఉంది. దీంతో ఈ ఫోన్ రూ.67,999కే లభించనుంది.
Read Also: Nirmala Sitharaman: వెండి ధరల పెరుగుదలపై కేంద్రానికి AIJGF లేఖ
ప్రధాన ఆకర్షణ
సాంకేతికపరంగా కూడా ఈ ఫోన్ ఎంతో ఉన్నతంగా ఉంది. దీనిలో గూగుల్ (Google Pixel)సొంతంగా అభివృద్ధి చేసిన టెన్సర్ G5 చిప్‌సెట్‌ను అమర్చారు. ఇది ఫోన్ పనితీరును మెరుగుపరచడమే కాకుండా బ్యాటరీ సామర్థ్యాన్ని కూడా పెంచుతుంది. 6.3 అంగుళాల యాక్చువా OLED డిస్‌ప్లే అద్భుతమైన రంగులను అందిస్తుంది. అంతేకాకుండా 3,000 నిట్స్ బ్రైట్‌నెస్ ఉండటం వల్ల కఠినమైన సూర్యరశ్మిలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపిస్తుంది. వేగవంతమైన ప్రాసెసింగ్, మెరుగైన గ్రాఫిక్స్‌తో ఈ ఫోన్ గేమింగ్, మల్టీటాస్కింగ్‌కు ఎంతో అనువుగా ఉంటుంది.
కెమెరా విభాగంలో గూగుల్ పిక్సెల్ 10 తన ఆధిపత్యాన్ని చాటుకుంటోంది. 48MP మెయిన్ కెమెరాతో పాటు టెలిఫొటో, అల్ట్రావైడ్ లెన్స్‌లు ఫోటోగ్రఫీని కొత్త పుంతలు తొక్కిస్తాయి. గూగుల్ జెమిని AI, మ్యాజిక్ ఎడిటర్ వంటి ఫీచర్లు ఫోటోలను ప్రొఫెషనల్‌గా మార్చడంలో సహాయపడతాయి. ముఖ్యంగా ఆండ్రాయిడ్ 16 ఓఎస్‌తో పనిచేసే ఈ ఫోన్‌కు గూగుల్ ఏకంగా 7 సంవత్సరాల పాటు సాఫ్ట్‌వేర్, సెక్యూరిటీ అప్‌డేట్లను అందిస్తామని హామీ ఇచ్చింది. ఇది దీర్ఘకాలం పాటు ఫోన్ వాడాలనుకునే వారికి ఒక ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: