📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం

Telugu news: SBI: ఎస్‌బీఐ వినియోగ దారులకు శుభవార్త.. రుణాల వడ్డీ రేట్లు తగ్గింపు

Author Icon By Tejaswini Y
Updated: December 13, 2025 • 3:40 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

SBI Interest Rates: దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన ఖాతాదారులకు ఊరట కలిగించే కీలక నిర్ణయం తీసుకుంది. వివిధ రకాల రుణాలపై వడ్డీ రేట్లతో పాటు కొన్ని టర్మ్ డిపాజిట్లపై వడ్డీలను స్వల్పంగా తగ్గిస్తున్నట్లు బ్యాంక్ ప్రకటించింది. ఈ సవరించిన వడ్డీ రేట్లు ఈ నెల 15 నుంచి అమల్లోకి రానున్నాయి.

Read also : iPhone 15: జియోమార్ట్‌లో ఐఫోన్ 15 ప్రోపై భారీ తగ్గింపు!

Good news for SBI customers.. reduction in loan interest rates

లోన్ తీసుకున్నవారికి లాభం

ఈ మార్పులతో హోం లోన్లు, వాహన రుణాలు, MSME లోన్లు తీసుకున్న వారికి ఈఎంఐ భారం కొంత తగ్గే అవకాశం ఉంది. అన్ని కాలపరిమితులపై మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటు (Marginal Cost of Funds Based Lending Rate)ను SBI 5 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీంతో ఒక సంవత్సరం కాలపరిమితి గల MCLR 8.70 శాతంగా నిలిచింది. అలాగే ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ లెండింగ్ రేటు (External benchmark lending rate)ను 25 బేసిస్ పాయింట్లు తగ్గించి 7.90 శాతంగా నిర్ణయించింది. ఇప్పటికే రుణాలు తీసుకున్న వారికి వర్తించే బేస్ రేటును కూడా 10 శాతం నుంచి 9.90 శాతానికి తగ్గించింది.

బ్యాంకింగ్ కస్టమర్లకు రిలీఫ్

ఇక మరోవైపు రూ.3 కోట్ల లోపు రిటైల్ టర్మ్ డిపాజిట్లపై కూడా వడ్డీ రేట్లను సవరించింది. 2 నుంచి 3 సంవత్సరాల లోపు డిపాజిట్లపై వడ్డీని 6.45 శాతం నుంచి 6.40 శాతానికి తగ్గించింది. సీనియర్ సిటిజన్లకు ఇదే కాలపరిమితిపై వడ్డీ రేటు 6.95 శాతం నుంచి 6.90 శాతానికి తగ్గింది. అదేవిధంగా ప్రజాదరణ పొందిన ‘అమృత్ వృష్టి’ 444 రోజుల డిపాజిట్ స్కీమ్‌పై వడ్డీ రేటును 6.60 శాతం నుంచి 6.45 శాతానికి తగ్గించింది.

ఇదిలా ఉండగా, ప్రభుత్వ రంగ బ్యాంకుల ఆర్థిక స్థితి బలపడటంతో 2022-23 ఆర్థిక సంవత్సరం నుంచి కేంద్ర ప్రభుత్వం వాటికి కొత్తగా మూలధనం కేటాయించలేదని ఇటీవలే వెల్లడించిన విషయం తెలిసిందే.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read also :

Car Loan Rates Home Loan Rates Loan EMI Relief MSME Loans SBI SBI Interest Rates State Bank of India

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.