Gold rate 27/02/26 : వారం తర్వాత తగ్గిన బంగారం ధరలు, కొనుగోలుదారులకు ఊరట

Read Time:  1 min
Gold price hyderabad
Gold price hyderabad
FONT SIZE
GET APP

Gold rate 27/02/26 : వారం రోజులుగా నిరంతరం పెరుగుతూ వచ్చిన బంగారం ధరలకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. దేశీయ బులియన్ మార్కెట్లో ఈరోజు పసిడి ధరలు తగ్గడంతో కొనుగోలుదారులకు ఊరట లభించింది. పెళ్లిళ్ల సీజన్ కొనసాగుతున్న నేపథ్యంలో అధిక ధరలతో ఇబ్బంది పడుతున్న వారికి ఇది మంచి అవకాశం అని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ బలహీనత, గ్లోబల్ అనిశ్చిత పరిస్థితులు స్వల్పంగా తగ్గడం వంటి కారణాలతో బంగారం ధరలు తగ్గినట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. స్పాట్ గోల్డ్ ఔన్స్ ధర సుమారు 33 డాలర్లు తగ్గి 5274 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. స్పాట్ సిల్వర్ ధర కూడా 3 శాతం వరకు పడిపోయి ఔన్స్‌కు సుమారు 88 డాలర్ల వద్దకు చేరింది.

Read Also: Telangana: టీచర్ల పనితీరు ఆధారంగా ప్రమోషన్లు

Gold rate 27/02/26
Gold rate 27/02/26

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములపై రూ.870 తగ్గింది. దీంతో తులం ధర రూ.1,61,020కు చేరింది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.800 తగ్గి తులం రూ.1,47,600 వద్ద నమోదైంది.

వెండి ధరల్లో కూడా మార్పులు కనిపిస్తున్నాయి. క్రితం రోజు రూ.5,000 తగ్గిన వెండి ధర ఈరోజు స్థిరంగా కొనసాగుతోంది. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర రూ.2,95,000 వద్ద ట్రేడవుతోంది.

ఈ ధరలు ఫిబ్రవరి 27 ఉదయం నమోదైనవి. బులియన్ మార్కెట్‌లో ధరలు రోజులో మారే అవకాశం ఉన్నందున కొనుగోలు ముందు స్థానిక రేట్లు తెలుసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Sai Kiran

రచయిత గురించి

Sai Kiran

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.