📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె

Gold : బంగారం దొరకడం మంచిదేనా..?

Author Icon By Sudha
Updated: January 19, 2026 • 5:06 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బంగారం కోల్పోవడం, దొరకడం జాతకంలో గ్రహాల స్థానాలపై ఆధారపడి ఉంటుంది. బంగారం పోగొట్టుకోవడం కేతువు, రాహువు, శని గ్రహాల ప్రతికూల ప్రభావానికి సూచనగా, ఆర్థిక, మానసిక సమస్యలకు దారితీస్తుంది. రోడ్డుపై బంగారం (Gold) దొరకడం సూర్యుడు, బృహస్పతి బలహీనతను సూచిస్తుంది; దానిని ఉంచుకోవడం అశుభం. ఇలాంటి పరిస్థితుల్లో దొరికిన బంగారాన్ని దానం చేయడం వల్ల ప్రతికూల ప్రభావాలు తగ్గి, శాంతి లభిస్తుంది. బంగారం (Gold) కేవలం విలువైన వస్తువు మాత్రమే కాదు..అది సంపద, అదృష్టం, గౌరవానికి చిహ్నం. ఆధ్యాత్మిక పరంగా బంగారం లక్ష్మిదేవికి ప్రతిరూపం.. జ్యోతిషశాస్త్రం ప్రకారం బంగారానికి సంబంధించిన సంఘటనలు ఒక వ్యక్తి జాతకంలో గ్రహాల స్థానానికి నేరుగా సంబంధం కలిగి ఉంటాయి. బంగారాన్ని కోల్పోవడం సాధారణంగా కేతువు, రాహువు, శని గ్రహాల ప్రతికూల ప్రభావానికి సూచనగా నమ్ముతారు. ఈ గ్రహాలు బలహీనమైన స్థితిలో ఉన్నప్పుడు, ఆర్థిక నష్టం, మానసిక ఒత్తిడి, ఆరోగ్య సమస్యలు పెరిగే అవకాశం ఉంది. అయితే రోడ్డు మీద బంగారం దొరకడం మంచిదేనా? లేక సొంత బంగారాన్ని పొగొట్టుకోవడం వల్ల ఏం జరుగుతుంది? బంగారం కోల్పోవడం అంటే కేవలం డబ్బు కోల్పోవడం మాత్రమే కాదని, భవిష్యత్తులో ఇతర విలువైన వస్తువులను కోల్పోవడానికి సంకేతం అని జ్యోతిష్కులు అంటున్నారు. ఇది దురదృష్ట కాలానికి నాందిగా కూడా పరిగణిస్తారు.. ఈ సమయంలో ఊహించని ఖర్చులు, ఉద్యోగంలో లేదా వ్యాపారంలో అడ్డంకులు తలెత్తవచ్చని నమ్ముతారు.

Read Also: Currency: 500 రూపాయల నోట్ల రద్దుపై PIB ఫ్యాక్ట్ చెక్ ఏం చెప్పిందంటే!

Gold

మరోవైపు, చాలా మంది రోడ్డు మీద లేదా ప్రయాణంలో బంగారం దొరకడం అదృష్టంగా భావిస్తారు. అయితే, జ్యోతిషశాస్త్ర దృక్పథం దీనికి విరుద్ధంగా ఉంది. రోడ్డు మీద బంగారం దొరకడం సూర్యుడు, బృహస్పతి బలహీనమైన స్థానానికి సూచనగా చెప్పబడుతుంది. ఇది కీర్తి, ఆత్మవిశ్వాసం, సామాజిక స్థితిని దెబ్బతీస్తుందని నమ్ముతారు. జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం, మీకు దొరికిన బంగారాన్ని మీ సొంతానికి ఉంచుకోవడం శుభం కాదు. దీని వలన ఆరోగ్య సమస్యలు, మానసిక అశాంతి, అనిశ్చిత పరిస్థితులు ఏర్పడవచ్చు. కాబట్టి, అటువంటి పరిస్థితులలో జాగ్రత్త అవసరమని గ్రంథాలు సూచిస్తున్నాయి. దీనికి పరిష్కారంగా రోడ్డుపై దొరికిన బంగారాన్ని గురువారం నాడు బ్రాహ్మణులకు లేదంటే, పేదలకు, ఇతరులకు దానధర్మాలుగా ఇవ్వడం ఉత్తమమని జ్యోతిష్యం సూచిస్తోంది. అలా చేయడం వల్ల కేతువు, రాహువు, శని గ్రహాల ప్రతికూల ప్రభావాలు తగ్గుతాయని, మనశ్శాంతి లభిస్తుందని విశ్వాసం. మొత్తం మీద, భారతీయ సంప్రదాయంలో బంగారం లక్ష్మీదేవితో ముడిపడి ఉన్న పవిత్ర లోహం. బంగారం దొరకడం–పోవడం అనేది ఒక వ్యక్తి జాతకంలో గ్రహాల అమరికపై ఆధారపడి ఉంటుంది. జ్యోతిషశాస్త్ర సూచనలను అర్థం చేసుకోవడం, సరైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ప్రతికూల ప్రభావాలను తగ్గించవచ్చని జ్యోతిశాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Breaking News gold gold discovery gold investment gold value latest news precious metals Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.