📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Telugu News: Giriraj Singh : మమతాకు వార్నింగ్ ఇచ్చిన కేంద్ర మంత్రి

Author Icon By Pooja
Updated: November 14, 2025 • 12:26 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు వేగంగా కొనసాగుతోంది. తాజా ట్రెండ్‌ల ప్రకారం 174 నియోజకవర్గాల్లో ఎన్డీఏ అభ్యర్థులు ఆధిక్యంలో ఉండగా, 66 స్థానాల్లో మహాఘట్భంధన్ (Mahaghatbandhan) బరిలో ఉన్న అభ్యర్థులు ముందంజ లో ఉన్నారు. ఆశలు పెట్టుకున్న ప్రశాంత్ కిశోర్ జన్‌సురాజ్ పార్టీ మాత్రం ఎక్కడా ప్రభావం చూపలేకపోయింది. ఈ పరిస్థితుల్లో, మరోసారి భారీ మెజార్టీతో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఖాయంగా కనిపిస్తోంది.

Read Also: Jubilee Hills Result: ఏడో రౌండ్‌లో కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం

Giriraj Singh

గిరిరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు

ఈ నేపథ్యంతో, కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్(Giriraj Singh) చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. అభివృద్ధి, పారదర్శక పాలన కోసం బీహార్ ప్రజలు మళ్లీ నరేంద్ర మోదీ – నితీష్ కుమార్ నాయకత్వాన్ని నమ్ముకున్నారని ఆయన అన్నారు.అదే సమయంలో,
“బీహార్‌లో అరాచక ప్రభుత్వానికి అవకాశం ఇవ్వమని ముందే చెప్పాం. ఇది అభివృద్ధి విజయము. ఇప్పుడు మా తదుపరి లక్ష్యం వెస్ట్ బెంగాల్” అని వ్యాఖ్యానించారు.

అందువల్ల ఆయన వ్యాఖ్యలు పరోక్షంగా మమతా బెనర్జీ ప్రభుత్వానికి రాజకీయ హెచ్చరికలుగా భావించబడుతున్నాయి. పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్‌కు ప్రధాన ప్రత్యర్థి బీజేపీ కావడం ఇందుకు కారణం.

మహాఘట్బంధన్‌కు పెద్ద దెబ్బ

లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని మహాఘట్బంధన్ (MGB) ఈ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు సాధించలేకపోయింది. తేజస్వి యాదవ్ ఆధ్వర్యంలోని ఆర్జేడీ (RJD) కొన్ని ముఖ్య(Giriraj Singh) ప్రాంతాల్లో బాగానే రాణించినప్పటికీ, కాంగ్రెస్ బలహీన ప్రదర్శన కూటమి ఓటమికి ప్రధాన కారణమైంది. 2020లో 75 సీట్లు గెలిచి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచిన ఆర్జేడీ, ఈసారి ఆ స్థితిని నిలబెట్టుకోలేకపోతుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి.

మళ్లీ సీఎం అవుతారా నితీష్ కుమార్?

రాష్ట్రంలో సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న నితీష్ కుమార్, ఐదోసారి వరుసగా అధికారం దక్కించుకుంటారా లేదా అనేది తుది ఫలితాలు స్పష్టం చేయనున్నాయి. భారీ మెజార్టీతో ఎన్డీఏ ముందంజలో ఉండటం వల్ల ఆయనకు మరోసారి సీఎం కుర్చీ దక్కే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

Giriraj Singh Latest News in Telugu Mahagathbandhan Narendra Modi NDA Lead Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.